AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యారెట్ హల్వా.. ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోద్దీ

క్యారెట్ హల్వా అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లలేకాకుండా పెద్ద వారు కూడా ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు మనం అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: Nov 26, 2026 | 1:38 PM

Share
క్యారట్ హల్వా తయారు చేసే విధానం చూసేద్దాం.. ముందుగా 1 కిలో క్యారెట్‌లను ఎంచుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి, పై పొట్టును  తీసేయాలి. ఆ తర్వాత క్యారెట్‌లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా 1 కిలో క్యారెట్‌లను ఎంచుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి, పై పొట్టును  తీసేయాలి. ఆ తర్వాత క్యారెట్‌లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

1 / 5
 కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కొద్దికొద్దిగా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. వీటిని ఒకేసారి గ్రైండ్ చేయకుండా, మధ్యమధ్యలో ఆపుతూ, కింది నుంచి పైకి కలుపుతూ బరకగా  గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యారెట్‌లు మనం తురిమినట్లుగానే టెక్చర్ వస్తుంది. ఒకవేళ కొన్ని పెద్ద ముక్కలు మిగిలితే, వాటిని మళ్ళీ గ్రైండ్ చేయవచ్చు. ఈ బరకగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.

2 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక, మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్ మిశ్రమాన్ని వేసి రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి.  క్యారెట్ మిశ్రమం ఫ్రై అయిన తర్వాత, ఒక కప్పు పాలు పోసి బాగా కలపాలి. ఈ దశలో కుక్కర్ ఉపయోగించడం వల్ల సమయం ఆదా అవుతుంది. కుక్కర్ మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒకవేళ మీరు గిన్నెలో తయారు చేయదలిస్తే, మీడియం ఫ్లేమ్‌లో దాదాపు 30 నిమిషాల పాటు, మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి.

3 / 5
కుక్కర్లో గాలంతా పోయిన తర్వాత, మూత తీసి చూస్తే క్యారెట్ తురుము సాఫ్ట్‌గా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, 150 గ్రాముల పంచదారను  క్యారెట్ మిశ్రమంలో కలపాలి. పంచదార వేయగానే మిశ్రమం పల్చబడుతుంది. కాబట్టి, రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ, అందులోని నీరంతా ఇంకిపోయి, హల్వా దగ్గర పడే వరకు ఉడికించాలి. ఈ ప్రక్రియకు దాదాపు 20-25 నిమిషాలు పట్టవచ్చు. హల్వా కాస్త దగ్గర పడిన తర్వాత, మరో కప్పు పాలు వేసి హల్వా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి.

4 / 5
తర్వాత పావు టీస్పూన్ యాలకుల పొడిని, చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ను వేసి బాగా కలపాలి. కావాలంటే, మంచి రంగు కోసం కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా కలుపుకోవచ్చు.ఇలా రెండు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ.

5 / 5
Follow Us