చలికాలంలో తప్పక తినాల్సిన పండ్లు ఇవే!

samatha

24 November 2026

Pic credit - Pinterest

శీతాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది తమ ఆరోగ్యం విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటారు ఆరోగ్యంపై దృష్టి పెడుతుంటారు.

శీతాకాలం

ముఖ్యంగా ఈ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, జీర్ణక్రియ సరిగ్గా సాగకపోవడం జరుగుతుంది. అటువంటి సమయంలో వారు మంచి ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు.

రోగనిరోధక శక్తి

అయితే ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల పండ్లు తినాలి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి.

తప్పక తినాల్సిన పండ్లు

చలికాలంలో తప్పకుండా, యాపిల్ పండు తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఈ పండు జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుందంట.

యాపిల్

 అంతే కాకుండా, జామకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, ఫైబర్ రెండూ ఉండటం వలన వీటిని కూడా శీతాకాలంలో తప్పకుండా తినాలి.

జామ

అదే విధంగా బొప్పాయి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో జీర్ణ ఎంజైములు ఉంటాయి. వీటిని తినడం వలన ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

బొప్పాయి

చాలా మంది ఉసిరి తినడానికి అంతగా ఆసక్తి చూపరు కానీ ఉసిరి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చలికాలంలో దీనిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఉసిరి

ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఈ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఇవి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. అందుకే క్రమం తప్పకుండా వీటిని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

సీజనల్ ఫ్రూట్స్