చాణక్య నీతి : జీవితంలో పైకి రావాలి అంటే? ఈ తప్పులు చేయకూడదు
samatha
26 November 2026
Pic credit - Pinterest
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.
చాణక్యుడు
అదే విధంగా చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో పైకి రావాలి అంటే తప్పకుండా కొన్ని తప్పులు చేయకూడదు అని సూచించాడు. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చేయకూడని తప్పులు
జీవితంలో విజయం సాధించడానికి కేవలం తెలివితేటలు మాత్రమే సరిపోవు. సరైన ఆలోచనా విధానం, క్రమశిక్షణ, ముందుచూపు వంటివి కూడా ముఖ్యమని ఆచార్య చాణక్యుడు తన నీతి సూత్రాలలో వివరించారు.
తెలివి తేటలు
మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు, మీ ప్రతి ఆలోచనను అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. కొందరు మిమ్మల్ని నిరుత్సాహపరచే ఛాన్స్ ఉంది. అందుకే ప్రణాళికలు పంచుకోకూడదు.
లక్ష్యం నిర్దేశించడం
జీవితంలో పురోగతిని అడ్డుకునేది బాహ్య సమస్యలు మాత్రమే కాదు, నియంత్రణ లేని భావోద్వేగాలు కూడా. కోపం, నిరాశ, అసూయ. వీటిని దరిచేరకుండా చూసుకోవాలి.
బాహ్య సమస్యలు
పెద్ద లక్ష్యాలు, తెలివితేటలు ఉన్నప్పటికీ, క్రమశిక్షణ లేకపోతే విజయం అసాధ్యం. ప్రతిభ విజయానికి ప్రారంభం కావచ్చు, కానీ నిరంతరం ముందుకు సాగడానికి క్రమశిక్షణే ముఖ్యం
పెద్ద లక్ష్యలు, తెలివితేటలు
మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారో వారి ఆలోచనలు, అలవాట్లు మీ జీవితంపై ప్రభావం చూపుతాయి. నిర్లక్ష్యంగా ఉండే, సోమరితనాన్ని ప్రోత్సహించే వ్యక్తులతో ఉంటే మీ లక్ష్యాలను కూడా నిర్లక్ష్యం చేయవచ్చు.
సమయం గడపడం
ఈ ప్రపంచంలో అత్యంత విలువైన సంపద సమయం. కోల్పోయిన డబ్బును తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన సమయాన్ని కాదు. చాలామంది సమయాన్ని నిర్లక్ష్యంగా గడుపుతూ, లక్ష్యాలను వాయిదా వేస్తుంటారు.