చలికాలంలో గ్రీన్ ఆపిల్ తింటే ఎంత మేలో తెలుసా?

samatha

26 November 2026

Pic credit - Pinterest

చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది రకరకాల పండ్లు తింటుంటారు. కానీ ఈ సమయంలో గ్రీన్ ఆపిల్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

చలికాలం

కాగా, ఇప్పుడు మనం శీతాకాలంలో గ్రీన్ ఆపిల్ తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం పదండి.

శీతాకాలం ఫ్రూట్స్

గ్రీన్ ఆపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందువలన దీన్ని తినడం వలన చలికాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం నుంచి మన శరీరానికి మంచి రక్షణ లభిస్తుంది.

విటమిన్ సి

ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, గ్రీన్ ఆపిల్ పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన చలికాలంలో వచ్చే మలబద్ధకం సమస్యను తగ్గించి కడుపు తేలిక చేస్తుంది.

ఫైబర్

అంతే కాకుండా,గ్రీన్ ఆపిల్ లో చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ ఉన్నవారికి కూడా ఇది చాలా బెస్ట్.

చక్కెర శాతం

గ్రీన్ ఆపిల్ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని పొడిబారకుండా కాపాడి, చలికాలంలో చర్మం కాంతి వంతంగా ఉండేలా చేస్తుంది.

చర్మ ఆరోగ్యం

అలాగే ప్రతి రోజూ ఒక గ్రీన్ ఆపిల్ తినడం వలన ఇది శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది, చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తినిస్తుంది.

రోగనిరోధక శక్తి

గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. గ్రీన్ యాపిల్ లో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీపీని అదుపులో ఉంచుతుంది.

గుండె, బీపీ అదుపులో