నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? ప్రాణాలకే ప్రమాదం..

26 November 2026

TV9 Telugu

TV9 Telugu

చాలా మందికి డీహైడ్రేషన్ గురించి తెలుసుగానీ ఓవర్ హైడ్రేషన్ గురించి అంత అవగాహన ఉండదు

TV9 Telugu

పరిమితికి మించి నీరు తాగితే ఈ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా అథ్లెట్లలో ఇది ఎక్కువ కనిపిస్తుంది

TV9 Telugu

ఓవర్ హైడ్రేషన్ అరుదైన సమస్యే కానీ అథ్లెట్లు తమ సామర్థ్యం పెంచుకునేందుకు నీళ్లు ఎక్కువగా తాగుతారు

TV9 Telugu

ఈ క్రమంలో శరీరంలో నీరు ఎక్కువై ఎలక్ట్రోలైట్ల (లవణాలు) స్థాయిల్లో మార్పులు వస్తాయి. ముందుగా సోడియం స్థాయి తగ్గిపోతుంది

TV9 Telugu

దీంతో ఆలోచనల్లో స్పష్టత లోపించినట్టు ఉండటం, వాంతులు, కండరాల బలహీనత, పట్టేసినట్టు ఉండటం, తలనొప్పి వంటివి తలెత్తుత్తాయి

TV9 Telugu

అత్యంత అరుదైన సందర్భాల్లో.. మెంటల్ కన్‌ఫ్యూజన్, ఫిట్స్‌తోపాటు కోమాలోకి కూడా వెళ్లొచ్చు

TV9 Telugu

ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే నీరు తాగే విషయంలోనూ నియంత్రణ పాటించాలని వైద్యులు చెబుతున్నారు

TV9 Telugu

సాధారణంగా గంటకు ఒక లీటరుకు మించి నీటిని తాగకూడదు. ఇలా చేస్తే శరీరంలోని అదనపు నీటిని తొలగించడానికి కిడ్నీలకు తగినంత సమయం దొరుకుతుంది