చలికాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందా? పుణుల సూచన

Jyothi Gadda

26 November 2026

ఆయుర్వేదం ప్రకారం పెరుగు కఫ దోషాన్ని పెంచుతుందని నమ్ముతారు, అందుకే రాత్రిపూట లేదా జలుబు ఉన్నప్పుడు తినకూడదంటారు, కానీ దీనిపై శాస్త్రీయ నిర్ధారణ లేదు.

పాల ఉత్పత్తులు తీసుకుంటే జలుబు ఉన్నవారిలో ముక్కు స్రావాలు, దగ్గు, ముక్కు దిబ్బడ పెరుగుతాయనడానికి పరిశోధనల్లో ఎటువంటి బలమైన ఆధారాలు లభించలేదని నిపుణులు తేల్చారు.

చలికాలంలో మందగించే జీర్ణక్రియను మెరుగుపరచడానికి పెరుగు ఎంతో తోడ్పడుతుంది.ఇందులోని ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థకు,రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.

పెరుగులో పుష్కలంగా ఉండే కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12 ఎముకలు,దంతాల బలానికి ఎంతో అవసరం, శరీరానికి చక్కని పోషకాలను అందిస్తాయి.

పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై సున్నితంగా పనిచేసి మృదువుగా మారుస్తుంది, అందుకే ఫేస్‌ప్యాక్‌గా వాడతారు, సున్నిత చర్మం ఉన్నవారు ముందుగా పరీక్షించుకోవాలి.

పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై సున్నితంగా పనిచేసి మృదువుగా మారుస్తుంది, అందుకే ఫేస్‌ప్యాక్‌గా వాడతారు, సున్నిత చర్మం ఉన్నవారు ముందుగా పరీక్షించుకోవాలి.

ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని పెరుగును వెంటనే తినడం వల్ల గొంతులో ఇబ్బంది కలగవచ్చు.కాబట్టి గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగును పగటిపూట తీసుకోవాలి.

కొందరికి వ్యక్తిగతంగా పెరుగు వల్ల ఇబ్బంది కలగవచ్చు.కాబట్టి ఇది అందరికీ ఒకేలా వర్తించదని, సమస్య ఉన్నవారు జాగ్రత్తగా గమనించి తీసుకోవాలని నిపుణులు సూచించారు.