AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు అద్భుత జ్ఞాపకశక్తి .. చదువులో చాలా చురుకు!

పిల్లల్లో తెలివితేటలు, జ్ఞాపకశక్తి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన పిల్లలు చాలా చురుగ్గా, తెలివిగా ఉంటారట. ఏ విషయాన్నైనా త్వరగా అర్థం చేసుకోవడంతో పాటు ఎక్కువ కాలం గుర్తుంచుకునే సామర్థ్యం కలిగి ఉంటారట. మరి అద్భుతమైన జ్ఞాపకశక్తి, తెలివితేటలు కలిగిన ఆ పిల్లలు ఏ తేదీల్లో జన్మిస్తారో తెలుసుకుందాం.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు అద్భుత జ్ఞాపకశక్తి .. చదువులో చాలా చురుకు!
Numerology
Janardhan Veluru
|

Updated on: Nov 26, 2026 | 5:00 PM

Share

పిల్లల తెలివితేటలు, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరు పిల్లలు పుట్టుకతోనే మేధావులుగా ఉంటారు. చిన్నతనంలోనే ఏ విషయాన్నైనా చాలా త్వరగా అర్థం చేసుకుని గుర్తుంచుకుంటారు. మరికొందరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొంత సమయం తీసుకుంటారు. అయితే సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన పిల్లలు పుట్టుకతోనే తెలివితేటలు, చురుకుదనం, అద్భుతమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారని నమ్ముతారు. ముఖ్యంగా మూడు మూల సంఖ్యలకు చెందిన పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని న్యూమరాలజీ చెబుతోంది. మరి ఆ మూల సంఖ్యలు ఏమిటి? ఏయే తేదీల్లో పుట్టిన పిల్లలు అద్భుత జ్ఞాపకశక్తి ఉంటుందో తెలుసుకుందాం.

మూల సంఖ్య 1

ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన పిల్లల మూల సంఖ్య 1 అవుతుంది. ఈ మూల సంఖ్యకు అధిపతి సూర్యుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ పిల్లలు ఎంతో చురుకుగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీరు చిన్నతనం నుంచే కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. ఒకసారి చూసిన లేదా విన్న విషయాలను త్వరగా గుర్తుంచుకునే సామర్థ్యం వీరికి ఉంటుందని నమ్ముతారు. ఏదైనా పని అప్పగిస్తే స్వతంత్రంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులు వీరిలోని ప్రతిభను గుర్తించి కొత్త విషయాలు నేర్చుకునేందుకు, సొంత నిర్ణయాలు తీసుకునేందుకు ప్రోత్సహించాలి.

మూల సంఖ్య 3

ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన పిల్లల మూల సంఖ్య 3 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురుడు (బృహస్పతి). ఈ మూల సంఖ్య పిల్లలు చదువుపై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. వీరు ఏ విషయాన్నైనా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కేవలం పాఠాలను కంఠస్థం చేయడమే కాకుండా, వాటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వీరిలో తార్కికంగా ఆలోచించే సామర్థ్యం, జ్ఞాపకశక్తి బాగుంటాయని భావిస్తారు. పుస్తకాలు చదవడం, ప్రశ్నలు అడగడం, కొత్త విషయాలు తెలుసుకోవడం వీరికి ఇష్టమైన అంశాలు.

ఇవి కూడా చదవండి

మూల సంఖ్య 5

ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీల్లో జన్మించిన పిల్లల మూల సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. జ్యోతిషశాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, మాటతీరు, తార్కిక సామర్థ్యానికి కారకుడిగా పరిగణిస్తారు. ఈ మూల సంఖ్య పిల్లలు ఎంతో తెలివిగా, చురుగ్గా ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకోవడంతో పాటు వాటిని గుర్తుంచుకునే సామర్థ్యం ఉంటుంది. ఎలాంటి ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. వీరిలో ఆసక్తి, పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంటాయి. నేర్చుకున్న విషయాలను సందర్భానుసారంగా ఉపయోగించుకోవడంలోనూ ముందుంటారని నమ్ముతారు.

Also Read: ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులంటే ప్రాణం.. ఎంతో ప్రేమ, బాధ్యతగా ఉంటారట!

(గమనిక: ఈ మూడు మూల సంఖ్యలకు చెందిన పిల్లల్లో తెలివితేటలు, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం ప్రత్యేకంగా ఉంటాయని న్యూమరాలజీ విశ్వాసాలు చెబుతున్నాయి. అయితే పిల్లల ప్రతిభను కేవలం పుట్టిన తేదీ ఆధారంగా నిర్ణయించలేం. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మంచి విద్య, సరైన వాతావరణం, సాధన కూడా వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి)

Follow Us