AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కందిపప్పు vs పెసరపప్పు.. మీ పొట్టకు ఏది మంచిది..? ఎప్పుడు ఏది తినాలో తెలుసుకోండి..

సాంబార్, ముద్దపప్పు, కిచిడీ.. మన భోజనంలో పప్పు లేని రోజు దాదాపు ఉండదు. అయితే మనం నిత్యం వండుకునే కందిపప్పు, పెసరపప్పులలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? జీర్ణక్రియకు ఏది బెస్ట్? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఈ రెండింటి పోషక విలువలు, శరీరంపై వాటి ప్రభావం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కందిపప్పు vs పెసరపప్పు.. మీ పొట్టకు ఏది మంచిది..? ఎప్పుడు ఏది తినాలో తెలుసుకోండి..
Moong Dal Vs Toor Dal
Krishna S
|

Updated on: Nov 26, 2026 | 4:24 PM

Share

మన రోజువారీ భోజన పళ్లెంలో పప్పు పాత్ర ఎనలేనిది. ప్రాంతాన్ని బట్టి రుచులు మారినా, వంటకాల తీరు వేరైనా, పప్పు లేని భోజనం చాలా ఇళ్లలో ఊహించలేం. ఇక ఎక్కువ ఉపయోగించే పెసరపప్పు, కందిపప్పులో ఏది ఆరోగ్యానికి మంచిది..? జీర్ణక్రియకు ఏది ఇబ్బంది లేకుండా ఇమిడిపోతుంది? అనే డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి. అయితే కడుపులో తేలికగా కలిసిపోయే గుణం పెసరపప్పు సొంతం. తక్కువ ఫ్యాట్, అధిక మొక్కల ఆధారిత ప్రోటీన్, ముఖ్యమైన విటమిన్లతో ఇది ఆరోగ్యకరమైన ఎంపికగా నిలుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి సమస్యలతో ఇబ్బంది పడేవారికి పెసరపప్పు మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడకుండా త్వరగా అరుగుతుంది. అనారోగ్యం బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారికి, పసిపిల్లలకు, వృద్ధులకు పెసరపప్పుతో తయారు చేసిన కిచిడీ లేదా మెత్తని పప్పు చక్కగా సరిపోతుంది. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే తత్వం ఉండటం వల్ల, రాత్రి వేళల్లో బరువుగా అనిపించని డిన్నర్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్. కరిగే ఫైబర్, పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండటానికి, మలబద్ధకం తగ్గడానికి కూడా ఇది దోహదపడుతుంది.

కందిపప్పు ఆర్యోగ్య ప్రయోజనాలు

మరోవైపు రుచి విషయంలో కందిపప్పుకు ప్రత్యేక స్థానం ఉంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి కలగలిసినా, ఘుమఘుమలాడే సాంబారు రూపంలో వచ్చినా దాని రుచే వేరు. ప్రోటీన్‌తో పాటు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఫోలేట్, ఐరన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది తిన్న తర్వాత చాలా సేపటి వరకు ఆకలి వేయదు. ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు, రోజంతా ఉత్సాహంగా పనిచేయాలనుకునే వారికి కందిపప్పు స్థిరమైన శక్తిని అందిస్తుంది. ఎదిగే పిల్లలకు, గర్భిణీలకు అవసరమైన ఫోలేట్, ఐరన్ ఇందులో ఉండటం అదనపు ప్రయోజనం.

నానబెడితో నో ప్రాబ్లెమ్స్

కొందరికి కందిపప్పు వల్ల గ్యాస్ లేదా కడుపుబ్బరం వచ్చే అవకాశం ఉంటుంది. కందిపప్పుతో జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే వండటానికి అరగంట ముందు నీళ్లలో నానబెట్టాలి. అలాగే తాలింపులో ఇంగువ, వెల్లుల్లి, జీలకర్ర వేసి వండితే సులభంగా అరుగుతుంది.

ఏది బెస్ట్..?

పెసరపప్పు లేదా కందిపప్పు.. రెండింటిలో ఏదో ఒక్కదానికే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు. కందిపప్పు, పెసరపప్పును మార్చి మార్చి వాడటం వల్ల డైట్‌లో వైవిధ్యం ఉంటుంది. రెండు రకాల పప్పులను తీసుకోవడం ద్వారా శరీరానికి వేర్వేరు అమైనో ఆమ్లాలు, ఖనిజాలు సమతుల్యంగా అందుతాయి. సాధారణంగా మధ్యాహ్న భోజనంలో కందిపప్పు, రాత్రి భోజనంలో పెసరపప్పు తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి అనుగుణంగా ఉంటుంది.

Follow Us