AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులి కాదు.. ఒకప్పుడు మన జాతీయ జంతువు ఏంటో తెలుసా..? ఆ ఒక్క నిర్ణయంతో మారిన కథ..

మన దేశ జాతీయ జంతువు ఏదంటే టక్కున పులి అని చెప్పేస్తాం. కానీ, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మన జాతీయ జంతువు పులి కాదనే విషయం మీకు తెలుసా..? ఒకప్పుడు గిర్ అడవుల్లో గర్జించే సింహానికి ఆ గౌరవం ఉండేది. మరి సింహాన్ని కాదని పులికి ఆ పట్టం ఎందుకు కట్టారు? ఈ మార్పు వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర ఏంటో తెలుసుకుందాం..

పులి కాదు.. ఒకప్పుడు మన జాతీయ జంతువు ఏంటో తెలుసా..? ఆ ఒక్క నిర్ణయంతో మారిన కథ..
Why Tiger Replaced Lion As National Animal Of India
Krishna S
|

Updated on: Nov 26, 2026 | 3:51 PM

Share

భారతదేశ జాతీయ జంతువు ఏదంటే టక్కున రాయల్ బెంగాల్ టైగర్ అని చెబుతాం. కానీ స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మన జాతీయ జంతువు పులి కాదు.. గుజరాత్ గిర్ అడవుల్లో గర్జించే ఆసియా సింహం. మరి 1972లో సింహాన్ని కాదని పులికి ఆ హోదా ఎందుకు కట్టబెట్టారు? ఇది కేవలం ఒక చిహ్నాన్ని మార్చిన కథ మాత్రమే కాదు అంతరించిపోతున్న ఒక జాతిని కాపాడుకోవడానికి చేసిన చారిత్రాత్మక పోరాటం. స్వాతంత్ర్యం తర్వాత భారత్ తన సొంత జాతీయ చిహ్నాలను ఖరారు చేసుకునే పనిలో పడింది. గుజరాత్ నేచురల్ హిస్టరీ సొసైటీ చేపట్టిన ప్రచారం ఫలితంగా 1948లో ఆసియా సింహానికి జాతీయ జంతువు హోదా దక్కింది. అప్పటికే మన జాతీయ చిహ్నమైన అశోక స్తంభంపై సింహం ఉండటంతో ఆ ఎంపిక సహజంగానే అనిపించింది. కానీ ఇక్కడొక చిక్కు వచ్చి పడింది. దేశం మొత్తానికి ప్రతీకగా నిలవాల్సిన సింహం కేవలం గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైపోయింది.

పులివైపు మొగ్గు ఎందుకు..?

మరోవైపు దేశంలోని 16 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పులుల సంఖ్య వేట, అడవుల నరికివేత కారణంగా వేగంగా తగ్గిపోతూ అంతరించిపోయే దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 1972 నవంబర్ 18న జరిగిన ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ సమావేశంలో సింహం స్థానంలో పులిని జాతీయ జంతువుగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ మార్పు వెనుక ప్రభుత్వం ప్రధానంగా మూడు కారణాలను పేర్కొంది.

  • పులికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రాముఖ్యత, దేశవ్యాప్తంగా దాని ఉనికి.
  • అంతరించిపోతున్న పులులకు దేశవ్యాప్తంగా కఠినమైన రక్షణ కల్పించాల్సిన తక్షణ అవసరం.
  • సింహం కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాగా, పులి దేశంలోని 16 రాష్ట్రాల్లో విస్తరించి ఉండటం.

నాడు వివాదం.. నేడు సత్ఫలితాలు

అప్పటి వన్యప్రాణి బోర్డు ఛైర్మన్ డాక్టర్ కరణ్ సింగ్ ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించారు. అయితే సింహాన్ని తొలగించడంపై అప్పట్లో గుజరాత్ సహా పలు వర్గాల నుండి తీవ్ర విమర్శలు, భావోద్వేగపూరిత నిరసనలు వ్యక్తమయ్యాయి. కానీ పులుల సంరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం లోక్‌సభలో సమర్థించుకుంది. జాతీయ జంతువుగా ప్రకటించిన కొద్ది నెలలకే, అంటే ఏప్రిల్ 1, 1973న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వేదికగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైంది. తొలుత 9 పులుల సంరక్షణ కేంద్రాలతో మొదలైన ఈ ప్రచారం అద్భుత ఫలితాలను ఇచ్చింది. 2006లో 1,411గా ఉన్న దేశంలోని పులుల సంఖ్య, 2022 నాటికి ఏకంగా 3,682కి పెరిగింది. నేడు ప్రపంచంలోని అడవి పులులలో అధిక భాగం భారతదేశంలోనే ఉండటం గర్వకారణం.

సింహాల సంరక్షణకూ పెద్దపీట

పులికి జాతీయ హోదా ఇచ్చినప్పటికీ, సింహాలను ప్రభుత్వం ఎన్నడూ విస్మరించలేదు. గిర్ సింహాల సంరక్షణ కోసం ప్రత్యేక ప్రాజెక్టులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. సింహాన్ని తిరిగి జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్లు అప్పుడప్పుడు వినిపిస్తున్నప్పటికీ, పులియే జాతీయ జంతువుగా కొనసాగుతుందని, ఆ హోదాను మార్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

Follow Us
పులి కాదు.. ఒకప్పుడు మన జాతీయ జంతువు ఏంటో తెలుసా..?
పులి కాదు.. ఒకప్పుడు మన జాతీయ జంతువు ఏంటో తెలుసా..?
చింత చెట్టు నుంచి చప్పుళ్లు.. కోతి అనుకుంటే పొరపాటే.. వామ్మో..
చింత చెట్టు నుంచి చప్పుళ్లు.. కోతి అనుకుంటే పొరపాటే.. వామ్మో..
అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలలో ఈ తప్పు చేస్తే జైలుకే..
అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలలో ఈ తప్పు చేస్తే జైలుకే..
Infinix క్రేజీ డీల్.. ప్రీమియం ఫీచర్స్ స్మార్ట్ టీవీ రూ.9,666కే !
Infinix క్రేజీ డీల్.. ప్రీమియం ఫీచర్స్ స్మార్ట్ టీవీ రూ.9,666కే !
కుల్దీప్‌ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పిన న్యూజిలాండ్ స్పిన్నర్
కుల్దీప్‌ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పిన న్యూజిలాండ్ స్పిన్నర్
చిరంజీవితో ఒక్క సినిమాతో సంచలనం.. కట్ చేస్తే.. తగ్గని గ్లామర్..
చిరంజీవితో ఒక్క సినిమాతో సంచలనం.. కట్ చేస్తే.. తగ్గని గ్లామర్..
చలికాలంలో ఎండు చేపలు తింటున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..
చలికాలంలో ఎండు చేపలు తింటున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..
ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో అలర్ట్: పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో అలర్ట్: పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
రెండో టెస్టులో టీమిండియా భారీ మార్పులు?
రెండో టెస్టులో టీమిండియా భారీ మార్పులు?
SL A vs IND A: టాస్ గెలిచిన భారత్.. అందరి చూపు బుడ్డోడిపైనే..
SL A vs IND A: టాస్ గెలిచిన భారత్.. అందరి చూపు బుడ్డోడిపైనే..