నెత్తురోడిన రోడ్డు.. బైకును తప్పించబోయి ఢీకొన్న కార్లు!

×

నెత్తురోడిన రోడ్డు.. బైకును తప్పించబోయి ఢీకొన్న కార్లు!

కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట వద్ద జాతీయ రహదారి రక్తసిక్తమైంది. జగ్గంపేట సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలవగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన క్రమంలో వేగంగా వస్తున్న రెండు కార్లు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు రెండు కార్ల ముందు భాగాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను, అందులో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం, సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

Janardhan Veluru