బంగారం కొనేటప్పుడు మనం ఎక్కువగా చూసేది హాల్ మార్క్. అది ఉంటే బంగారం స్వచ్ఛమైనదని నమ్ముతాం. అయితే, ఇప్పుడు హాల్ మార్క్ ఉన్న బంగారంలోనూ కల్తీ జరుగుతోందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. రీనియం అనే అరుదైన లోహాన్ని బంగారంలో కలిపి దాని బరువును పెంచుతున్నారు. రీనియం గ్రాముకు ₹400 ఉండగా, బంగారం గ్రాముకు ₹12,000 (22 క్యారెట్లు) వరకు ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని ఉపయోగించుకుని మోసగాళ్లు లాభపడుతున్నారు. విచిత్రమేమిటంటే, నగల వ్యాపారులు లేదా హాల్ మార్క్ సెంటర్లు కూడా ఈ రీనియం కల్తీని గుర్తించలేకపోతున్నాయి. ఎందుకంటే, రీనియం లోహం వారి పరీక్షల జాబితాలో లేదు. రాజస్థాన్, ముంబై వంటి నగరాల్లో ఇలాంటి కల్తీ జరుగుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.