Infinix క్రేజీ డీల్.. ప్రీమియం ఫీచర్స్ స్మార్ట్ టీవీ రూ.9,666కే !
టెక్ మార్కెట్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న బ్రాండ్ ఇన్ఫినిక్స్ (Infinix). తక్కువ బడ్జెట్‌లో కొత్త గ్యాడ్జెట్లు కొనాలనుకునే వారికి ఈ బ్రాండ్ మంచి ఛాయిస్‌గా నిలుస్తుంది. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ టీవిపై మరో క్రేజీ డీల్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఆ వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

టెక్ మార్కెట్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న బ్రాండ్ ఇన్ఫినిక్స్ (Infinix). స్మార్ట్‌ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు సహా పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వరకు.. ఆధునిక ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన డిజైన్‌లో ఉత్పత్తులను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో కొత్త గ్యాడ్జెట్లు కొనాలనుకునే వారికి ఈ బ్రాండ్ మంచి ఛాయిస్‌గా నిలుస్తుంది. ఇప్పుడు కొత్తగా మరో క్రేజీ డీల్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
స్మార్ట్ టీవీపై అదిరిపోయే ఆఫర్..
కాగా ఇప్పుడు ఈ బ్రాండ్‌కు చెందిన స్మార్ట్ టీవిపై బెస్ట్ ఆఫర్ తీసుకొచ్చింది. 80 cm (32 inch) HD Ready LED Smart Linux TV (32Y1D/32Y1C/32Y1B) టీవీ ప్రస్తుతం రూ.9,666 ఆఫర్ ధరతో అందుబాటులో ఉంది. బెజెల్-లెస్ డిజైన్, 20W డాల్బీ ఆడియో, ఓటీటీ యాప్స్.. వైఫై, స్క్రీన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా పాత టీవీ స్థానంలో రూ.10 వేల లోపు ధరత్వ కొత్తది కొనాలనుకునే వారికి ఇది మంచి డీల్ అంటూ చెబుతున్నారు. ఈ స్మార్ట్ టీవి మరిన్ని ఫీచర్స్ మీకోసం ప్రత్యేకంగా..
Infinix HD Ready LED Smart Linux TV ఫీచర్స్..
1. డిజైన్, డిస్‌ప్లే..
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 32 అంగుళాల (80 సెం.మీ) స్క్రీన్‌తో వస్తుంది. చుట్టూ అంచులు తక్కువగా ఉండే బెజెల్-లెస్ డిజైన్ టీవీకి ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. 1366 × 768 పిక్సెల్స్ హెచ్‌డీ రెడీ రిజల్యూషన్‌తో పాటు 60Hz రిఫ్రెష్ రేట్, 250 నిట్స్ బ్రైట్‌నెస్ ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉండటంతో స్క్రీన్‌కు ఎదురుగా కాకుండా పక్కన కూర్చున్నా విజువల్స్‌ను చూడవచ్చు.
2. డాల్బీ ఆడియో సపోర్ట్..
టీవీ కొనుగోలు చేసేటప్పుడు డిస్‌ప్లేతో పాటు సౌండ్ క్వాలిటీ కూడా ముఖ్యమే. ఇందులో 20 వాట్ల బాక్స్ స్పీకర్లను అందించింది. వీటికి డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. దీంతో సినిమాలు, పాటలు, టీవీ షోలు, క్రికెట్ మ్యాచ్‌లు చూసేటప్పుడు స్పష్టమైన ఆడియో అనుభూతి లభిస్తుంది.
3. లినక్స్ ఓఎస్.. క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఈ స్మార్ట్ టీవీ లినక్స్ (Linux) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. సాధారణ స్మార్ట్ టీవీ అవసరాలకు అనుగుణంగా యాప్స్‌ను యాక్సెస్ చేయడానికి, వీడియోలను వీక్షించడానికి ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది.
4. యూట్యూబ్, ప్రైమ్ వీడియో సహా ఓటీటీ యాప్స్
ఈ టీవీలో యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, సోనీ లివ్ వంటి ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. దీంతో విడిగా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునే అవసరం లేకుండా అందుబాటులో ఉన్న సేవలను నేరుగా యాక్సెస్ చేయవచ్చు. అంతేకాకుండా రిమోట్‌లో యూట్యూబ్, ప్రైమ్ వీడియో కోసం ప్రత్యేక హాట్‌కీలు ఉండటంతో ఒక్క బటన్ నొక్కి ఆయా యాప్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఓటీటీ కంటెంట్‌ను వీక్షించడానికి సంబంధిత సబ్‌స్క్రిప్షన్ అవసరం.
5. కనెక్టివిటీ ఫీచర్లు..
కనెక్టివిటీ పరంగా కూడా ఈ టీవీలో అవసరమైన పోర్టులు ఉన్నాయి. ఇందులో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, బిల్ట్-ఇన్ వైఫై, ఈథర్నెట్ పోర్ట్ అందించారు. వీటి ద్వారా సెట్-టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్, పెన్‌డ్రైవ్ వంటి పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్‌ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలను టీవీ పెద్ద స్క్రీన్‌పై వీక్షించేందుకు స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్ కూడా ఉంది.
6. బాక్స్‌లోనే వాల్ మౌంట్, టేబుల్ స్టాండ్
టీవీ కొనుగోలు చేసిన తర్వాత అదనంగా కొన్ని యాక్సెసరీలు కొనాల్సిన అవసరం లేకుండా బాక్స్‌లోనే వాల్ మౌంట్, టేబుల్ స్టాండ్, స్మార్ట్ రిమోట్ అందిస్తున్నారు. దీంతో అవసరాన్ని బట్టి గోడకు అమర్చుకోవచ్చు లేదా టేబుల్‌పై ఏర్పాటు చేసుకోవచ్చు.
7. వారంటీ..
కంపెనీ తరఫున ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది.
గమనిక.. అయితే కొనుగోలు చేసే ముందు ప్రస్తుత ధర, అందుబాటులో ఉన్న ఆఫర్లు, విక్రేత వివరాలు, వారంటీ నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.
