AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడంకెల ధరకే కత్తిలాంటి ఇయర్‌బడ్స్‌ ఇచ్చేస్తున్న Fire-Boltt Aero Pro.. ప్రత్యేకతలివే

తక్కువ ధరలో మంచి సౌండ్ క్వాలిటీతో పాటు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ ఇచ్చే ఇయర్‌బడ్స్‌ కోసం చూస్తున్నారా? అయితే Fire-Boltt నుంచి వచ్చిన కొత్త Aero Pro ఇయర్‌బడ్స్‌ ఒక ఆప్షన్‌గా నిలవనున్నాయి. కేవలం రూ.899 ధరలోనే 50 గంటల వరకు ప్లేబ్యాక్‌, కస్టమ్ ఈక్వలైజర్ ప్రొఫైల్స్‌, క్వాడ్ మైక్ ENC టెక్నాలజీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో రోజువారీ మ్యూజిక్ వినడం, ఫోన్ కాల్స్ మాట్లాడటం వంటి అవసరాలకు వీటిని ఉపయోగించుకోవచ్చు.

మూడంకెల ధరకే కత్తిలాంటి ఇయర్‌బడ్స్‌ ఇచ్చేస్తున్న Fire-Boltt Aero Pro.. ప్రత్యేకతలివే
Fire Boltt Aero Pro
Nikhil
|

Updated on: Nov 26, 2026 | 7:45 AM

Share

ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ఇయర్‌బడ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో Fire-Boltt Aero Pro మోడల్‌లో డిజైన్‌, కనెక్టివిటీ, బ్యాటరీ బ్యాకప్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సేజ్ కలర్‌లో అందుబాటులో ఉన్న ఈ ఇయర్‌బడ్స్‌ ఎర్గోనామిక్ డిజైన్‌తో వస్తున్నాయి. ఎక్కువసేపు చెవుల్లో పెట్టుకున్నా సౌకర్యంగా ఉండేలా వీటిని రూపొందించారు. రూ.వెయ్యి లోపు ధరలో ఇలాంటి ఫీచర్లు కోరుకునే వారికి ఈ మోడల్‌ ఆసక్తికరంగా మారవచ్చు.

క్వాడ్ మైక్ ENC ప్రత్యేకతలు

Fire-Boltt Aero Proలో కస్టమ్ EQ ప్రొఫైల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వినియోగదారులు తమ అభిరుచికి అనుగుణంగా సౌండ్‌ను మార్చుకోవచ్చు. బాస్ ఎక్కువగా కావాలన్నా, వోకల్స్ స్పష్టంగా వినాలన్నా లేదా బ్యాలెన్స్‌డ్ సౌండ్ కావాలన్నా అందుబాటులో ఉన్న ఈక్వలైజర్ ప్రొఫైల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాల ఇబ్బందిని తగ్గించేందుకు క్వాడ్ మైక్ ENC టెక్నాలజీని అందించారు. ఇందులోని నాలుగు మైకులు పరిసరాల శబ్దాన్ని తగ్గించి వాయిస్ స్పష్టతకు సహాయపడతాయి. ముఖ్యంగా బయట ఉన్నప్పుడు, రద్దీ ప్రదేశాల్లో కాల్స్ మాట్లాడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

50 గంటల బ్యాటరీ బ్యాకప్‌

కనెక్టివిటీ కోసం ఈ ఇయర్‌బడ్స్‌లో Bluetooth 5.4 వెర్షన్‌ను అందించారు. వేగంగా కనెక్ట్ అవ్వడంతో పాటు స్థిరమైన కనెక్షన్‌కు ఇది ఉపయోగపడుతుంది. గేమింగ్ సమయంలో ఆడియో ల్యాగ్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 50 గంటల వరకు ప్లేబ్యాక్‌ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. Type-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా ఉంది. మొత్తం మీద రూ.899 ధరలో 50 గంటల బ్యాటరీ, కస్టమ్ EQ ప్రొఫైల్స్‌, క్వాడ్ మైక్ ENC, Bluetooth 5.4 వంటి ఫీచర్లు కోరుకునే వారికి Fire-Boltt Aero Pro ఒక బడ్జెట్ ఆప్షన్‌గా నిలవనుంది.

Follow Us