AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైక్‌ లవర్స్‌కి నిద్ర లేకుండా చేస్తున్న Bajaj Pulsar 125 Neon స్పై.. ఫీచర్లు అలాంటివి మరి

ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో Bajaj Pulsar బైక్‌లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా 125cc సెగ్మెంట్‌లో Pulsar 125 మంచి ఆదరణ పొందుతోంది. ఈ క్రమంలో బజాజ్ తన పల్సర్ లైనప్‌లో మరో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Bajaj Pulsar 125 Neon పేరుతో రానున్న ఈ బైక్ తాజాగా విడుదలకు ముందే కనిపించింది. బయటకు వచ్చిన ఫొటోలను బట్టి చూస్తే పాత పల్సర్ డిజైన్‌తోనే ఈ కొత్త మోడల్‌ను రూపొందించినట్లు అర్థమవుతోంది.

బైక్‌ లవర్స్‌కి నిద్ర లేకుండా చేస్తున్న Bajaj Pulsar 125 Neon స్పై.. ఫీచర్లు అలాంటివి మరి
Bajaj Pulsar 125 Neon
Nikhil
|

Updated on: Nov 26, 2026 | 7:05 AM

Share

తక్కువ ధరలో పల్సర్ బైక్ కొనాలనుకునే మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని Bajaj Pulsar 125 Neon వేరియంట్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఇందులో ఖరీదైన ఫీచర్లు, కొత్త మెకానికల్ మార్పులకు బదులుగా పాత విడిభాగాలను కొనసాగించే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత క్లాసిక్ Pulsar 125 కంటే తక్కువ ధరకు ఈ బైక్ అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా ధర, విడుదల తేదీని ప్రకటించలేదు.

పాత డిజైన్‌తో Pulsar 125 Neon..

బయటకు వచ్చిన చిత్రాల ప్రకారం కొత్త Bajaj Pulsar 125 Neonలో పాత పల్సర్ డిజైన్‌ను కొనసాగించనున్నారు. ఇటీవల అప్‌డేట్ చేసిన Pulsar 125లో మోనోషాక్ సస్పెన్షన్‌, కొత్త ఛాసిస్‌ను అందించారు. అయితే నియాన్ వేరియంట్‌లో పాత ఛాసిస్‌తో పాటు వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్లను ఉపయోగించే అవకాశం ఉంది. ముందు డిస్క్ బ్రేక్‌, వెనుక డ్రమ్ బ్రేక్‌ ఉండనున్నాయి. సింగిల్ పీస్ సీటు, సాధారణ గ్రాబ్ రైల్‌, చైన్ కవర్‌, బల్బ్ ఇండికేటర్లు, LED టెయిల్ లైట్ వంటి ఫీచర్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ బైక్ రెడ్‌, బ్లూ రంగుల్లో దర్శనమిచ్చింది.

124.4cc ఇంజన్..

ఇంజన్ విషయానికి వస్తే.. Pulsar 125 Neonలో 124.4cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉండవచ్చని సమాచారం. ఇది 11.8hp పవర్‌, 10.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేయనున్నారు. అయితే ఈ వివరాలను బజాజ్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం విక్రయిస్తున్న క్లాసిక్ Pulsar 125లో 124.58cc ఇంజన్ ఉండగా, ఇది 12.1hp పవర్‌, 11.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పోలిస్తే నియాన్ వేరియంట్ పనితీరు కొద్దిగా తక్కువగా ఉండవచ్చు.

ప్రస్తుతం క్లాసిక్ Pulsar 125 ధరలు రూ.91,716 నుంచి రూ.1.03 లక్షల వరకు ఉన్నాయి. కొత్త నియాన్ వేరియంట్ వీటి కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్‌లో పల్సర్ బైక్ కొనాలనుకునే వారికి ఇది మరో ఎంపికగా మారవచ్చు. అయితే ధర, పూర్తి ఫీచర్లు, లాంచ్ తేదీపై బజాజ్ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Follow Us