కొత్త ఫోన్ కొన్నారా? డేటా ట్రాన్స్‌ఫర్‌లో ఈ తప్పులు చేస్తే ఫొటోలు మిస్ అయిపోతాయి
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినప్పుడు పాత ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్స్, మెసేజ్‌లు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కొత్త ఫోన్‌లోకి మార్చుకోవడం చాలామందికి అవసరమైన పని. ముఖ్యంగా iPhone నుంచి Android ఫోన్‌కు మారేటప్పుడు డేటా మొత్తం సరిగ్గా బదిలీ అవుతుందా? ఏమైనా మిస్ అవుతాయా? అనే సందేహాలు ఉంటాయి. ఫోన్ మార్చే సమయంలో సరైన విధానాన్ని పాటించకపోతే కీలకమైన ఫొటోలు, చాట్స్, ఇతర వివరాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ కి డేటా ట్రాన్స్ ఫర్ చేసే సమస్యకు పరిష్కారంగా Google అందిస్తున్న Android Switch టూల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా పాత ఫోన్‌లోని సమాచారాన్ని కొత్త Android ఫోన్‌కు బదిలీ చేసుకోవచ్చు. కేబుల్ ద్వారా లేదా వైర్‌లెస్ విధానంలో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ట్రాన్స్‌ఫర్ పూర్తయినట్లు స్క్రీన్‌పై కనిపించినంత మాత్రాన మొత్తం డేటా వచ్చేసిందని భావించకూడదు. కొత్త ఫోన్‌లో ప్రతి అంశాన్ని చెక్ చేసుకున్న తర్వాతే పాత ఫోన్‌ను రీసెట్ చేయడం మంచిది.
డేటా ట్రాన్స్‌ఫర్‌కు ముందు జాగ్రత్తలు..
డేటా బదిలీ ప్రారంభించే ముందు పాత iPhoneలోని సమాచారాన్ని iCloud లేదా కంప్యూటర్‌లో బ్యాకప్ తీసుకోవాలి. కొత్త Android ఫోన్‌లో డేటా మొత్తం నిల్వ చేసుకునేందుకు సరిపడా స్టోరేజ్ ఉందో లేదో ముందుగానే పరిశీలించాలి. iPhoneలో iMessage, FaceTimeలను ఆఫ్ చేయడం కూడా ముఖ్యం. లేదంటే కొత్త ఫోన్‌కు మారిన తర్వాత కొన్ని మెసేజ్‌లు అందకపోవచ్చు. రెండు ఫోన్లలో బ్యాటరీ సరిపడా ఉండేలా చూసుకోవడంతో పాటు స్థిరమైన Wi-Fi కనెక్షన్ అందుబాటులో ఉంచాలి.
Android Switchలో కేబుల్ ద్వారా డేటా బదిలీ చేస్తే కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ మెసేజ్‌లను మార్చుకోవచ్చు. వైర్‌లెస్ విధానంలో QR కోడ్ స్కాన్ చేసి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. Pixel 8, కొత్త Samsung Galaxy వంటి ఫోన్లలో అందుబాటులో ఉండే అప్‌గ్రేడెడ్ ట్రాన్స్‌ఫర్ విధానం ద్వారా సేవ్ చేసిన పాస్‌వర్డ్స్, కాల్ హిస్టరీ, Wi-Fi సెట్టింగ్స్ వంటి వివరాలను కూడా బదిలీ చేసుకోవచ్చు.
WhatsApp చాట్స్, iCloud ఫొటోల కోసం ప్రత్యేక విధానం..
సాధారణ డేటా ట్రాన్స్‌ఫర్‌లో WhatsApp చాట్స్, iCloud ఫొటోలు అన్నీ ఆటోమేటిక్‌గా కొత్త ఫోన్‌లోకి రావు. WhatsApp చాట్ హిస్టరీని మార్చుకోవడానికి యాప్ సెట్టింగ్స్‌లోని ‘Move Chats to Android’ ఆప్షన్ ఉపయోగించి QR కోడ్ ద్వారా బదిలీ చేసుకోవాలి.
iCloudలో ఉన్న ఫొటోలను Google Photosకు మార్చుకోవడానికి Apple Data & Privacy వెబ్‌సైట్‌లో ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. Google అకౌంట్‌లో తగినంత స్టోరేజ్ ఉంటే ఫొటోలు, వీడియోలు సాధారణంగా మూడు నుంచి ఏడు రోజుల్లో బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది.
డేటా ట్రాన్స్‌ఫర్ 100 శాతం పూర్తయిన తర్వాత కూడా పాత iPhoneను వెంటనే ఫార్మాట్ చేయకూడదు. కొత్త ఫోన్‌లో ఫొటోలు, కాంటాక్ట్స్, WhatsApp మెసేజ్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలి. బ్యాంకింగ్ యాప్స్ లాగిన్ అవుతున్నాయా, OTPలు అందుతున్నాయా, అవసరమైన ఫైళ్లు ఓపెన్ అవుతున్నాయా అని కూడా చెక్ చేసుకోవాలి. ఈ పనులన్నీ పూర్తయ్యాకే పాత ఫోన్‌లోని డేటాను క్లియర్ చేయడం సురక్షితం.
