AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 26 రాశిఫలాలు: వీరికి ఆదాయానికి కొత్త మార్గాలు! ఖర్చుల విషయంలో జాగ్రత్త

Horoscope Today(26 November, 2026): గురువారం కొన్ని రాశుల వారికి ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు, మరికొందరికి ఆదాయ వృద్ధికి సంబంధించిన అవకాశాలు ఎదురుకానున్నాయి. వృత్తి జీవితంలో పురోగతి కనిపించినప్పటికీ, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగం, కుటుంబం, వ్యక్తిగత విషయాల్లో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

నవంబర్ 26 రాశిఫలాలు: వీరికి ఆదాయానికి కొత్త మార్గాలు! ఖర్చుల విషయంలో జాగ్రత్త
Today Horoscope 26 November 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 26, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 26, 2026): మేష రాశి వారు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది. వృషభ రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చులు సమస్యగా మారతాయి. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి బాగా అవకాశముంది. ఉచిత సహాయాలకు దూరంగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధికే కాక, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు కూడా సమయం అనుకూలంగా ఉంది. మాటకు సర్వత్రా విలువ పెరుగుతుంది. బంధుమిత్రుల్లో కూడా గౌరవమర్యాదలు ఇనుమడిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చులు సమస్యగా మారతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం బాగా హ్యాపీగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయ వృద్ధికి బాగా అవకాశముంది. ఉచిత సహాయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. ఆదాయ ప్రయత్నాలు, ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల విషయంలో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఇతరుల బాధ్యతల్ని నెత్తికెత్తుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆర్థిక పరిస్థి తులు బాగా మెరుగుపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందు తాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా పురోగమిస్తాయి. జీవిత భాగ స్వామితో విభేదాలు పరిష్కారమై, సామరస్యం ఏర్పడుతుంది. ఇరుగు పొరుగుతో వాదనలకు దిగ వద్దు. కుటుంబ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దగ్గర బంధువులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలను అభివృద్ది బాట పట్టిస్తారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ పరిస్థితులు చాలావరకు సంతృప్తికరంగా, సామరస్యంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. ఇష్టమైన ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మదుపులు చేయడానికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరగడా నికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న లాభాల్ని ఆర్జిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్ర మాల్లో బిజీ అవుతారు. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక విషయాల్లో సొంత నిర్ణయాలు మంచిది. ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. దైవ కార్యాలలో పాల్గొనడం, ఆలయాల సందర్శన చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సా హకాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి లాభపడతారు. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. కొందరు బంధువుల నుంచి ఇబ్బందులు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు అందుతాయి. తల్లితండ్రుల ఆరోగ్యం విషయంలో కాస్తంత శ్రద్ధ పెట్టడం మంచిది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

Follow Us
మొబైల్‌లో డేటా ట్రాన్స్‌ఫర్‌లో ఈ తప్పులు చేస్తే ఫొటోలు మిస్‌
మొబైల్‌లో డేటా ట్రాన్స్‌ఫర్‌లో ఈ తప్పులు చేస్తే ఫొటోలు మిస్‌
నవంబర్ 26 రాశిఫలాలు: వీరికి ఆదాయానికి కొత్త మార్గాలు!
నవంబర్ 26 రాశిఫలాలు: వీరికి ఆదాయానికి కొత్త మార్గాలు!
ఉబెర్ ప్రయాణంలో మహిళకు ఊహించని అనుభవం!
ఉబెర్ ప్రయాణంలో మహిళకు ఊహించని అనుభవం!
పిల్లల కోసం యూనిక్ నేమ్స్ ఆలోచిస్తున్నారా.. ఇవి ట్రై చేస్తారా ?
పిల్లల కోసం యూనిక్ నేమ్స్ ఆలోచిస్తున్నారా.. ఇవి ట్రై చేస్తారా ?
లేటు వయసులో ఘాటు ప్రేమ.. కన్నీళ్లు పెట్టించే జీవిత కథ!
లేటు వయసులో ఘాటు ప్రేమ.. కన్నీళ్లు పెట్టించే జీవిత కథ!
సుజుకీ స్కూటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త రంగుల్లో యాక్సెస్ !
సుజుకీ స్కూటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త రంగుల్లో యాక్సెస్ !
కార్తీక మాసం గురువారం ఈ చిన్న పూజ చేస్తే.. దక్షిణామూర్తి అనుగ్రహం
కార్తీక మాసం గురువారం ఈ చిన్న పూజ చేస్తే.. దక్షిణామూర్తి అనుగ్రహం
భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారీ సుంకాలకు ప్రతిపాదన!
భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారీ సుంకాలకు ప్రతిపాదన!
ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఇప్పటికీ ట్రెండింగ్.
ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఇప్పటికీ ట్రెండింగ్.
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. డిసెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే !
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. డిసెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే !