మజ్జిగలోని లాక్టిక్ ఆమ్లం కడుపులో ఆమ్ల స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కారం లేదా మసాలా ఆహారం తిన్న తర్వాత వచ్చే ఎసిడిటీ, గుండెల్లో మంట సమస్యలను తగ్గిస్తుంది.
శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చలవ చేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో లేదా శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కడుపుకు చల్లదనాన్ని ఇస్తుంది.
శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యత నిలిచి భోజనం తర్వాత వచ్చే నీరసం, బద్ధకం తగ్గుతాయి.
మజ్జిగలో క్యాలరీలు, కొవ్వులు తక్కువగా ఉండి ప్రోటీన్లు ఉంటాయి. ఇది కడుపు నిండిన భావన కలిగించి అనవసరమైన ఆకలిని అదుపు చేస్తుంది.
తద్వారా బరువు నిర్వహణకు తోడ్పడుతుంది.
మజ్జిగలో కాల్షియం, విటమిన్ డి, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు లభిస్తాయి, ఇవి ఎముకలు, దంతాలను బలంగా ఉండేలా చేస్తుంది.
పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతూ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, తద్వారా సాధారణ ఇన్ఫెక్షన్లు, కడుపు సంబంధిత సమస్యల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది.
మజ్జిగలో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడతాయి, హృదయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
జీలకర్ర పొడి, కొత్తిమీర లేదా కొద్దిగా మిరియాల పొడి కలిపిన మజ్జిగ రుచిని పెంచుతుంది. జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పి ఉన్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి.