2027 రాశిఫలాలు: కొత్త ఏడాది గ్రహ సంచారాలు.. ఏయే రాశులకు అదృష్టం? ఎవరికి సవాళ్లు?
2027 Yearly Horoscope: 2027లో శని, గురు, రాహు, కేతువుల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. ఈ కీలక గ్రహాల సంచార ప్రభావం 12 రాశుల వారి జీవితాలపై తప్పనిసరిగా ఉండే అవకాశముంది. ఈ గ్రహాల మార్పులతో కొన్ని రాశుల వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడితే, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

జ్యోతిష్య పరంగా 2027 సంవత్సరం అత్యంత కీలకంగా మారనుంది. కొత్త ఏడాదిలో ప్రధాన గ్రహాలైన శని, గురు, రాహు, కేతువులు తమ రాశులను మార్చుకోబోతున్నారు. ముఖ్యంగా శని, గురు గ్రహాల సంచారంలో చోటుచేసుకునే మార్పులు 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపనున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అంశాల్లో కొందరికి అనుకూల ఫలితాలు లభిస్తే, మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. మరి 2027లో ఏ గ్రహం ఎప్పుడు రాశి మారుతుంది? ఏయే రాశులకు అదృష్టం కలిసిరానుంది? తెలుసుకుందాం.
2027లో శని సంచారం.. కీలక మార్పులు
జ్యోతిష్య శాస్త్రంలో శనిని కర్మఫల ప్రదాతగా పరిగణిస్తారు. వ్యక్తి చేసే పనులను బట్టి ఫలితాలను అందించే శని భగవానుడు 2027లో కీలకమైన రాశి మార్పులు చేయబోతున్నాడు.
- జూన్ 3, 2027: మీన రాశి నుంచి మేష రాశిలోకి శని ప్రవేశిస్తాడు.
- ఆగస్టు 9, 2027: మేష రాశిలో శని వక్రగమనాన్ని ప్రారంభిస్తాడు.
- అక్టోబర్ 20, 2027: తిరిగి వక్రగతిలోనే మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.
- డిసెంబర్ 24, 2027: మీన రాశిలో శని మార్గి అవుతాడు.
శని మేష రాశిలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ముఖ్యంగా సాడే సాతీ మొదటి దశలోకి ప్రవేశిస్తారు.
గురు సంచారం 2027.. మూడు రాశుల్లో మార్పులు
దేవగురువు బృహస్పతి 2027లో వేగవంతమైన సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా ఒకే సంవత్సరంలో మూడుసార్లు రాశి మార్పు ఉంటుంది.
- జనవరి 25, 2027: కర్కాటక రాశిలోకి గురు ప్రవేశం.
- ఏప్రిల్ 13, 2027: కర్కాటక రాశిలో గురు మార్గి అవుతాడు.
- జూన్ 26, 2027: కర్కాటకం నుంచి సింహ రాశిలోకి గురు ప్రవేశం.
- నవంబర్ 26, 2027: సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి గురు సంచారం.
గురు సంచారంలో ఈ మార్పులు వివిధ రాశుల వారికి వేర్వేరు ఫలితాలను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, సంపద వంటి అంశాలపై గురు ప్రభావం ఉంటుంది.
రాహు కేతువుల సంచారం.. ఏడాదంతా ఈ రాశుల్లోనే!
రాహు, కేతువులు 2027 సంవత్సరంలో మకర, కర్కాటక రాశుల్లో సంచరించనున్నారు. 2026 డిసెంబర్ 5న ఈ రెండు ఛాయా గ్రహాలు రాశి మార్పు చేసి, 2027 సంవత్సరం మొత్తం ఇదే స్థానాల్లో కొనసాగుతాయని అంచనా.
రాహువు మకర రాశిలో, కేతువు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల 12 రాశుల వారి జీవితాల్లో మార్పులు చోటుచేసుకునే . కెరీర్, కుటుంబ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు, ఆధ్యాత్మిక విషయాలపై వీటి ప్రభావం ఉండే అవకాశం ఉంది.
2027లో అదృష్టం కలిసివచ్చే రాశులు
జ్యోతిష్య అంచనాల ప్రకారం 2027లో ఎనిమిది రాశుల వారికి గ్రహ సంచారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
- మేష రాశి
- వృషభ రాశి
- కర్కాటక రాశి
- సింహ రాశి
- తులా రాశి
- వృశ్చిక రాశి
- మకర రాశి
- కుంభ రాశి
ఈ రాశుల వారికి వివిధ గ్రహాల అనుకూల సంచారంతో జీవితంలో పురోగతి సాధించే అవకాశాలు ఏర్పడుతాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు పొందవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి.
2027లో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి
కొత్త ఏడాదిలో కొన్ని రాశుల వారు గ్రహ సంచారాల ప్రభావంతో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.
- మిథున రాశి
- కన్యా రాశి
- ధనుస్సు రాశి
- మీన రాశి
ఈ రాశుల వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా వ్యవహరించడం మంచిదని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి.




