కుజ, కేతువుల కటాక్షం.. డిసెంబర్ 5 వరకు వీరికి అదృష్టమే అదృష్టం..!
Mars-Ketu Conjunction 2026: అరుదుగా ఏర్పడే కుజ, కేతువుల కలయికతో ఆరు రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ గ్రహాల కలయిక ప్రభావంతో ఆదాయం పెరగడం, ఉద్యోగంలో అధికారం, వృత్తి వ్యాపారాల్లో పురోగతితో పాటు ఆరోగ్యపరంగానూ అనుకూలత ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇంతకీ ఈ గ్రహ సంయోగంతో అదృష్టాన్ని అందుకోబోతున్న ఆ ఆరు రాశులేవి?

గ్రహ సంచారంలో కుజ, కేతువులు కలవడమనేది అరుదుగా జరుగుతుంటుంది. అందులోనూ ఒకే నక్షత్రంలో కలవడం విశేషం. ప్రస్తుతం కుజ, కేతువులు కేతువుకు చెందిన మఖా నక్షత్రం లోనూ డిసెంబర్ 5 వరకు సంచారం చేయడం జరుగుతోంది. ఇవి సింహ రాశిలో యుతి చెందు తున్నాయి. సాధారణంగా ఈ రెండు పాప గ్రహాలు కలిసే పక్షంలో కొన్ని రాశులకు ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. సింహ రాశి కుజ గ్రహానికి మిత్ర క్షేత్రం. అందువల్ల ఈ రాశిలో కుజుడు మరింత శక్తిమంతంగా వ్యవహరిస్తాడు. మేషం, మిథునం, సింహం, తుల, వృశ్చిక, ధనూ రాశుల వారికి ఈ రెండు గ్రహాల కలయిక అధికారం, ఆరోగ్యం, ఆదాయ భాగ్యాలను కలిగిస్తుంది.
మేషం
రాశ్యధిపతి కుజుడు పంచమ స్థానంలో కేతువుతో మఖా నక్షత్రంలో కలవడం వల్ల డిసెంబర్ 5 వరకు ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశాలున్నాయి. ఆదాయం తప్పకుండా వృద్ధి చెందుతుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టినా, ఎక్కడ మదుపు చేసినా విశేషంగా లాభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశంఉంది.
మిథునం
ఈ రాశికి వృద్ధి స్థానమైన తృతీయ స్థానంలో కుజ, కేతువులు కేతు నక్షత్రంలో సంచారం వల్ల ఆదాయ వృద్ధికి, ఉద్యోగంలో పురోగతికి బాగా అవకాశం ఉంది. తక్కువ ప్రయత్నంతో అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు, ఆఫర్లు లభిస్తాయి.
సింహం
ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు మఖా నక్షత్రంలో కేతువుతో ఇదే రాశిలో సంచారం చేయ డంవల్ల ఈ రాశివారికి ఊహించని అదృష్టాలు కలుగుతాయి. ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతాయి. నిరు ద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది.
తులా రాశి
ఈ రాశికి లాభ స్థానంలో కుజ, కేతువులు మఖా నక్షత్రంలో యుతి చెందడం వల్ల ఈ రాశివారికి కలలో కూడా ఊహించని రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపా రాల వల్ల అంచనాల్ని మించిన లాభాలు కలుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
వృశ్చిక రాశి
రాశ్యధిపతి కుజుడు దశమ స్థాన సంచారమే ఒక విశేషం కాగా, అక్కడ కేతువుతో ఒకే నక్షత్రంలో యుతి చెందడం మరింత విశేషం. ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
ధనుస్సు రాశి
ఈ రాశికి భాగ్య స్థానంలో కుజ కేతువులు ఒకే నక్షత్రంలో యుతి చెందడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. తండ్రి వైపు నుంచి భూ లాభాలు కలిగే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యో గులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదన యోగం పట్టే అవకాశం కూడా ఉంది.



