యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు క్షణాల్లోనే విత్ డ్రా చేసుకోవచ్చు.. ప్రారంభానికి అంతా రెడీ.. ఎప్పుడంటే..?
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్. ఇటీవల పీఎఫ్ వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఈపీఎఫ్ఓ.. మరో కొత్త ఫీచర్‌పై కూడా ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. అదే యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు క్షణాల్లోనే విత్ డ్రా చేసుకునే సదుపాయం. ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై క్లారిటీ వచ్చేసింది.

పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో మరో గుడ్ న్యూస్ అందనుంది. ఇటీవల ఈపీఎఫ్ఓ వాట్సప్ సేవలన అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు వాట్సప్ చాట్‌బాట్ తీసుకొచ్చింది. దీని ద్వారా వాట్సప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం, గత ఐదు లావాదేవీలను తెలుసుకోవడం వంటి ఫీచర్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఫీచర్లను కూడా వాట్సప్ సేవల్లో తీసుకొచ్చే అవకాశముంది. అలాగే వాట్సప్ ఛానెల్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ చానెల్‌లో పీఎఫ్ సేవలకు సంబంధించిన సమాచారం మొత్తం పొందవచ్చు. క్రమంలో మరో కొత్త ఫీచర్ ప్రారంభించేందుకు ఈపీఎఫ్ఓ సిద్దమైంది. వచ్చే నెలలోనే ఇది ప్రారంభం కానుందని తెలుస్తోంది.
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకుని సౌకర్యాన్ని డిసెంబర్ నెలలో ఈపీఎఫ్ఓ ప్రారంభించనుందని సమాచారం. గత కొద్ది నెలలుగా ఇది ట్రయల్స్ దశలో ఉండగా.. అప్పుడు టెస్టింగ్ పూర్తయింది. దీంతో వచ్చే నెలలో లాంచ్ చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే పీఎఫ్ నిధులను యూపీఐ ద్వారా తక్షణమే విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పని ఉండదు. డిసెంబర్ చివరినాటికి దీనిని ప్రారంభించనుండగా.. ఫిబ్రవరి నుంచి పూర్తిగా అమల్లోకి రానుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ట్రయల్స్ దాదాపుగా పూర్తి అయినట్లు ఈపీఎఫ్ఓ అధికారులు తెలిపారు. ఈపీఎఫ్ఓ 3.0 వ్యవస్థలో భాగంగా ఈ కొత్త మార్పులు తీసుకొస్తున్నారు.
ఎంతవరకు విత్ డ్రా చేసుకోవచ్చు..?
యూపీఐ ద్వారా సులువుగా విత్ డ్రా చేసుకునే సదుపాయం వల్ల కాగితపు పని అనేది తగ్గుతుంది. అలాగే క్లెయిమ్ ప్రాసెస్ మరింత వేగవంతం అవుతుంది. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను బ్యాంక్ అకౌంట్లోకి సెకన్లలోనే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏటీఎం ద్వారా వెంటనే తీసుకోవచ్చు. అక్టోబర్ 2025లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 3.0 ఫ్రేమ్‌వర్క్ ఆమోదించింది. ఏడాదిలోగా దీనిని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే నెలలోనే యూపీఐ విత్ డ్రా ఫీచర్‌ను తీసుకురానుందని తెలుస్తోంది. అయితే ఈపీఎఫ్ఓ ద్వారా ఎంతవరకు విత్ డ్రా చేసుకోవచ్చనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో 75 శాతం వరకు పాక్షికంగా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండగా.. కొద్ది రోజుల క్రితం 90 శాతానికి పరిమితి పెంచారు. దీంతో యూపీఐ ద్వారా కూడా 90 శాతం వరకు నగదును ఉపసంహరించుకోవచ్చా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఫీచర్ ప్రారంభం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశముంది.
