AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మగవాళ్ల మిస్టరీ మరణాలు.. ఓటీటీని షేక్ చేస్తోన్న సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఓటీటీలో మంచి ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ తమిళ్ మూవీ మీకు మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: మగవాళ్ల మిస్టరీ మరణాలు.. ఓటీటీని షేక్ చేస్తోన్న సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 24, 2026 | 11:17 AM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు రానున్నాయి. దృశ్యం 3.. ది కంక్లూజన్, హనుమాన్ అంశ్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ వే, ఆదర్శ కుటుంబం( అధికారిక ప్రకటన రావాల్సి ఉంది) వంటి ఎన్నో ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈ వీకెండ్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటి సంగతి పక్కన పెడితే ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఓ తమిళ్ సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇదొక మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక కంటెంట్ పరంగానూ ఈ మూవీపై ప్రశంసలు వచ్చాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింట్ గా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. .. ఈ సినిమా కథ అంతా ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో ప్రతి ఏడేళ్లకు ఒకసారి, అది కూడా జూన్ నెలలోనే మగవాళ్లు అనుమానాస్పద రీతిలో వరుసగా చనిపోతూ ఉంటారు. ఇది ఊరికి పట్టిన శాపం అని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తుంటారు. ఇదే క్రమంలో ఊరికి కొత్తగా ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్ వస్తాడు. ఊరిలో వరుస మరణాల గురించి తెలుసుకుంటాడు. అయితే దర్యాప్తు సాగుతుండగానే అనూహ్యంగా తన ఇంట్లోనే మరణాలు సంభవిస్తాయి. ఇదే క్రమంలో ఎస్‌ ఐకు కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. ఆ ఊరిలో ఎన్నో తరాలుగా పాతుకుపోయిన చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. మరి ఊరిలో మగవాళ్ల వరుస మరణాలకు కారణమేంటి? పోలీస్ ఇన్ స్పెక్టర్ ఆ మిస్టరీని ఎలా ఛేదించాడన్నదే ఈ సినిమా అసలు కథ.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘ది డార్క్ హెవెన్’ (The Dark Heaven). ఇదొక తమిళ మిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవవీ. బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాలో సిద్ధు సిద్, దర్శిక, రిత్విక, వెలా రామమూర్తి, నిళల్‌గళ్ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే ఓటీటీలో వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోతో పాటు ఆహా, సింప్లీ సౌత్‌, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా ఓటీటీల్లో ‘ది డార్క్ హెవెన్’ స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. మంచి ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ‘ది డార్క్ హెవెన్’ సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ది డార్క్ హెవెన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us