AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: క్లీంకారను స్కూల్‌లో చేర్పించిన రామ్ చరణ్, ఉపాసన.. వీడియో ఇదిగో

పిల్లలు తొలి సారి పాఠశాలలో అడుగుపెట్టే రోజు తల్లిదండ్రుల జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం. ఇప్పుడిదే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు. తాజాగా క్లింకార కొణిదెల ప్రీ స్కూల్ లో అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ram Charan: క్లీంకారను స్కూల్‌లో చేర్పించిన రామ్ చరణ్, ఉపాసన.. వీడియో ఇదిగో
Ram Charan And Upasana
Basha Shek
|

Updated on: Nov 24, 2026 | 10:03 AM

Share

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లింకార కొణిదెల తన విద్యా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం మూడేళ్ల వయసున్న క్లీంకార తాజాగా ప్రీ స్కూల్‌లో అడుగుపెట్టింది. రామ్ చరణ్, ఉపాసనలు స్వయంగా క్లింకారను స్కూల్ లో చేర్పించారు. ఏ స్కూల్ లో చేర్పించారో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇందులో క్లింకార చాలా క్యూట్ గా అల్లరి చేస్తూ కనిపించింది. ఈ వీడియోను చూసిన మెగాభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. క్లింకార చాలా క్యూట్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా 2011లో పెళ్లి చేసుకున్నరామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న క్లీంకార జన్మించింది. సుమారు 12 ఏళ్ల తర్వాత క్లింకార పుట్టడంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక చిన్నారి నామకరణ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఇక క్లింకార పుట్టినప్పటి నుంచే ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది ఉపాసన. కాగా క్లింకార తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో రామ్ చరణ్- ఉపాసనలకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో పెద్ది సినిమాలో కనిపించారు రామ్ చరణ్. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు మెగా పవర్ స్టార్. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడిదే కాంబినేషన్ లో మరో సినిమా వస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ మెగా మూవీలో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్లీంకారను స్కూల్‌లో చేర్పించిన రామ్ చరణ్, ఉపాసన.. వీడియో ఇదిగో
క్లీంకారను స్కూల్‌లో చేర్పించిన రామ్ చరణ్, ఉపాసన.. వీడియో ఇదిగో
జ్వాలా తోరణం దర్శనం చేస్తే నరకబాధలు ఉండవా? కాకార్తీ పౌర్ణమి రోజు
జ్వాలా తోరణం దర్శనం చేస్తే నరకబాధలు ఉండవా? కాకార్తీ పౌర్ణమి రోజు
కార్తీక పౌర్ణమి స్పెషల్.. పచ్చి పసుపు అన్నం.. తింటే దగ్గు మాయం
కార్తీక పౌర్ణమి స్పెషల్.. పచ్చి పసుపు అన్నం.. తింటే దగ్గు మాయం
గిల్ కాదా.. సచిన్‌కు కూతురు పెళ్లి చేసుకోబోయేది ఎవరినంటే?
గిల్ కాదా.. సచిన్‌కు కూతురు పెళ్లి చేసుకోబోయేది ఎవరినంటే?
డింపుల్‌కు పెళ్లయిపోయిందా? స్వయంగా క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్
డింపుల్‌కు పెళ్లయిపోయిందా? స్వయంగా క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్
ఇందిమ్మ బీమా పథకంలో నమోదు చేసుకునేవారికి అలర్ట్..
ఇందిమ్మ బీమా పథకంలో నమోదు చేసుకునేవారికి అలర్ట్..
కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటి? 365 వత్తులతో దీపారాధన ఎందుకు..
కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటి? 365 వత్తులతో దీపారాధన ఎందుకు..
పూణేలో దారుణం.. ప్రియురాలిని కొట్టి చంపిన ప్రియుడు..
పూణేలో దారుణం.. ప్రియురాలిని కొట్టి చంపిన ప్రియుడు..
మిర్చి బజ్జీలు వేసిన హీరో.. వీడియో వైరల్!
మిర్చి బజ్జీలు వేసిన హీరో.. వీడియో వైరల్!
హైదరాబాద్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. తోపు ప్లేయర్ రెడీ..!
హైదరాబాద్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. తోపు ప్లేయర్ రెడీ..!