నటి సదా పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టేనా 

23 November 2026

Rajeev Rayala 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సద.

 నితిన్ హీరోగా నటించిన జయం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించింది.

 జయం తర్వాత అపరిచితుడు, ఔనన్నా కాదన్నా, టక్కరి వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

గ్లామర్ పాత్రలకు దూరంగా: కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సద.. ఆ తర్వాత నటనకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత ఆసక్తులపై దృష్టి పెట్టింది.

సినిమాలతో సంబంధం లేకుండా ప్రకృతిని, అడవి జంతువులను కెమెరాలో బంధించడం మొదలుపెట్టింది.

వివిధ ప్రాంతాలకు వెళ్లి వన్యప్రాణుల అందాలను తన కెమెరాలో బంధిస్తూ కొత్త ప్రపంచాన్ని ఆస్వాదిస్తోంది