AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక మనకు తిరుగే లేదు భయ్యా..! విపరీత రాజయోగంతో వీరికి మహర్దశలు

Vipareeta Raja Yoga 2026: జ్యోతిష శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన యోగాల్లో విపరీత రాజయోగం ఒకటి. ఈ యోగం ప్రభావంతో కొందరి జీవితాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ అదృష్టం కలిసిరానుంది. ఇంతకీ ఈ అరుదైన రాజయోగం వల్ల ప్రయోజనం పొందనున్న ఆ ఆరు రాశులేవి?

ఇక మనకు తిరుగే లేదు భయ్యా..! విపరీత రాజయోగంతో వీరికి మహర్దశలు
Vipareeta Raja Yoga 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 24, 2026 | 11:12 AM

Share

జ్యోతిష శాస్త్రంలో విపరీత రాజయోగం ఎంతో విశిష్టమైనది. దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో గానీ, గ్రహ సంచారంలో గానీ 6, 8, 12 స్థానాల అధిపతులు ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా లేక ఎవరి స్థానాల్లో వారున్నా విపరీత రాజయోగం పడుతుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడం, వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి పురోగతి సాధించడం, అనేక విధాలుగా ఆదాయం పెరగడం, శుభవార్తలు ఎక్కువగా వినడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, మనసులోని కోరికలు నెరవేరడం, జీవనశైలి మెరుగుపడడం వంటివి ఈ విపరీత రాజయోగం కిందకు వస్తాయి. ప్రస్తుతం వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఈ యోగం పట్టింది.

వృషభ రాశి

ఈ రాశికి షష్టాధిపతి అయిన శుక్రుడు షష్ట స్థానంలోనే ఉన్నందువల్ల జనవరి 2 వరకు ఈ రాశి వారికి విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల సిరిసంపదలు కలుగుతాయి. జీవన శైలి బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సంపన్న కుటుంబా నికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ, దాంపత్య జీవితాల్లో సుఖసంతోషాలు పెరుగుతాయి.

సింహ రాశి

ఈ రాశికి షష్టాధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. ఇది వచ్చే ఏడాది జూలై వరకూ కొనసాగుతుంది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఇబ్బడిముబ్బడిగా లాభాలనిస్తాయి.

ఇవి కూడా చదవండి

కన్య రాశి

ఈ రాశికి అష్టమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. వచ్చే ఏడాది మార్చి 10 వరకూ కొనసాగే ఈ యోగం వల్ల ఈ రాశివారి మాటకు, చేతకు తిరుగుండదు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. సామాజి కంగా రాజపూజ్యాలు కలుగుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందు తాయి.

వృశ్చిక రాశి

ఈ రాశికి అష్టమ, వ్యయాధిపతులైన బుధ, శుక్రులు వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ ఏడాదంతా ఈ రాశివారి జీవితం రాజసంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాభవం బాగా పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. రాబడికి లోటుండదు. అనేక మార్గాల్లో ధన లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆదాయ వృద్దికి ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది.

మకర రాశి

ఈ రాశికి వ్యయ స్థానాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉన్నందువల్ల విపరీత రాజ యోగం ఏర్పడింది. జనవరి 25 వరకు ఇది కొనసాగుతుంది. ఉద్యోగంలో ఒకటికి రెండుసార్లు పదో న్నతులు లభించడం, అంచనాలకు మించి వేతనాలు పెరగడం వంటివి జరుగుతాయి. ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. సంపన్నులయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీయానానికి బాగా అవకాశం ఉంది.

మీన రాశి

ఈ రాశికి అష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి జనవరి 2 వరకు విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోతాయి. గృహయోగం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

Follow Us