Kuja Stambhana: కుజ స్తంభన.. వీరికి ఆర్థిక, కెరీర్ విషయాల్లో పెను మార్పులు
Mars Stambhana 2026-27: దాదాపు నాలుగు నెలల పాటు కొనసాగనున్న కుజ స్తంభన కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులకు కారణం కానుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఊహించని అవకాశాలు అందివచ్చే సూచనలు ఉన్నాయి. ఇంతకీ ఏయే రాశుల వారికి ఈ గ్రహ సంచారం కలిసిరానుంది? ఎలాంటి శుభ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి?

ఈ నెల(నవంబర్) 13 నుంచి సింహ రాశిలో ప్రారంభమైన కుజ స్తంభన (Kuja Stambhana) 2027 మార్చి 10తో ముగుస్తుంది. కుజుడు ఒక రాశిలో ఎక్కువ కాలం కొనసాగడాన్నే కుజ స్తంభన అంటారు. సుమారు 117 రోజుల పాటు కొనసాగే ఈ కుజ స్తంభన వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో ఆర్థికంగానూ, ఉద్యోగపరం గానూ కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశులవారికి దీని వల్ల ఆర్థిక, ఉద్యోగ విజయాలతో పాటు కొన్ని కొత్త అవకాశాలు చేతికి అందుతాయి. ఇష్టమైన ఉద్యోగంలో చేరడం, ఆర్థికంగా పురోగతి చెందడం, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరగడం వంటివి జరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
మేష రాశి
రాశ్యధిపతి కుజుడు పంచమ స్థానంలో స్తంభించడం వల్ల ఈ రాశివారిలో పోటీతత్వం, పోరాట తత్వం బాగా పెరుగుతాయి. ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధిస్తారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఎటువంటి పోటీ ఎదురైనా, ఎటువంటి సవాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవడం, విజయం సాధించడం జరుగుతాయి. ఆర్థిక పరిస్థితిని గట్టు పట్టుదలతో మెరుగుపరచుకుంటారు. ఉద్యోగంలో సీనియర్లను మించిపోతారు. ఏ రంగంలో ఉన్నా రాణిస్తారు.
కర్కాటక రాశి
ఈ రాశికి ధన స్థానంలో కుజ స్తంభన వల్ల ఉద్యోగంలో విపరీత రాజయోగం పడుతుంది. ఎంత పోటీ ఉన్నా ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో సంపద పెరుగుతుంది. ఐ.టి రంగానికి చెందినవారికి కొత్త ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరు గు తాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుప డుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి.
సింహ రాశి
ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ఈ రాశిలో స్తంభించడం వల్ల శత్రువులు, ప్రత్యర్థులు, పోటీ దార్ల మీద పైచేయిగా ఉంటుంది. రుణ, రోగ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఏ రంగంలో ఉన్నా దూసుకుపోతారు. కొత్త ఆలోచనలు, ప్రయత్నాలతో వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణను చూరగొంటారు. పని తీరులో ఇతర ఉద్యోగులను మించి పోతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి.
తులా రాశి
ఈ రాశికి లాభ స్థానంలో కుజ స్తంభన వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఆదాయం అత్యధి కంగా వృద్ది చెందుతుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఘన విజయాలు సాధిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో సాను కూల ఫలితాలు పొందుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడు తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రావలసిన సొమ్మును రాబట్టుకుం టారు.
వృశ్చిక రాశి
రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో స్తంభించిపోవడం వల్ల ఆదాయ వృద్ది ప్రయత్నాలన్నీ ఘన విజయాలు సాధిస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం కలగడంతో పాటు ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఐటీ రంగంవారికి అనేక ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులు పట్టు దలగా మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆస్తి వివాదాల్ని రాజీమార్గంలో పరిష్కరించుకుం టారు.
ధనుస్సు రాశి
ఈ రాశికి భాగ్య స్థానంలో కుజ స్తంభన వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. తప్పకుండా అధి కార యోగం పడుతుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, లిక్కర్, ఎక్సైజ్, ప్రభుత్వం వంటి రంగాల్లో ఉన్నవారు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది. రాజ కీయ ప్రాబల్యం కలుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు.



