AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 20 రాశిఫలాలు.. ఈ రోజు వీరికి పట్టిందల్లా బంగారమే..!

Horoscope Today (November 20, 2026): శుక్రవారం గ్రహగతుల ప్రకారం 12 రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి? కొందరికి ఆర్థికంగా కలిసిరానుండగా, మరికొందరికి ప్రేమ, కుటుంబ వ్యవహారాలు సంతోషాన్ని కలిగించనున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

నవంబర్ 20 రాశిఫలాలు.. ఈ రోజు వీరికి పట్టిందల్లా బంగారమే..!
Horoscope Today 20 November 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 20, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 20, 2026): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మిథున రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గురు, శుక్ర, రాహువుల వల్ల రోజంతా విజయవంతంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి చెందుతారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. తల పెట్టిన పనులు, వ్యవహారాలన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. కొందరు స్నేహితులు సహాయ సహకారాలు అందజేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

చతుర్థ స్థానంలో గురు, కుజులు ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుజ, శుక్ర, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. అధికారులతో సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతాయి. జీవిత భాగస్వామికి ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపా రాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా పురోగమిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గురు, రవి, శుక్ర, కుజ గ్రహాల అనుకూలత ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, కొద్దిగా కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో లబ్ధి పొందుతారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వ్యక్తిగత సమస్యల వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రధానమైన కార్యకలాపాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. విద్యార్థులు చదువులపై బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా పురోగమిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ప్రస్తుతం ధన స్థానం బలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో వేగం పుంజుకుంటాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

లాభ స్థానంలో ఉన్న కుజ, గురువుల కారణంగా వృత్తి, ఉద్యోగాలపరంగా అధిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి, గౌరవ మర్యా దలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీ ప్రయత్నాలు లాభాల్ని తెచ్చిపెడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించి పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

దశమ స్థానంలో ఉన్న కుజ, గురువుల కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మేరకు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేయడం వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గురు, బుధ, శుక్ర, కుజ, రవుల అనుకూలత ఎక్కువగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం అను కూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

శుక్ర, బుధ, శని, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ నేతలతో పరిచయాలు విస్తరిస్తాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

బుధ, శుక్ర, గురు, రవులు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లి సంబంధం కుదుతుంది. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుజ, చంద్రుల అనుకూలత వల్ల రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగుతుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటుండదు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి.

Follow Us