ఈరోజు రాశి ఫలాలు
తమ భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువ మంది తమ భవిష్యత్తు గురించి ముందే తెలుసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసిస్తారు. జన్మకాలంలో గ్రహాల స్థితిగతులతో పాటు నామ నక్షత్రాలు, పేరులోని తొలి అక్షరాలు, ఇతర అంశాలు దీనికి ప్రామాణికంగా పరిగణిస్తారు. మేషం, వృషభం మొదలు 12 రాశులుగా విభవించి.. ఒక్కొక్కరి రాశి ఆధారంగా వారి రాశిఫలాన్ని లెక్కిస్తారు. ఫలానా రోజు ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందన్న అంశాన్ని గ్రహాల స్థితిగతుల ఆధారంగా దిన ఫలాలను జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అలాగే వారఫలాలు, మాసఫలాలు, గ్రహ సంచారం ఆధారంగా ఆయా రాశుల వారిపై ఎలా ఉంటుందన్న అంశాన్ని అంశాన్ని లెక్కించి చెబుతున్నారు.
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (January 3, 2026): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు సాయం చేయడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Jan 3, 2026
- 5:31 am
Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (January 2, 2026): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. వృషభ రాశి వారి ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మిథున రాశి వారు ఉద్యోగంలో భారీ లక్ష్యాలను పూర్తి చేయవలసివస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Jan 2, 2026
- 5:31 am
Horoscope Today: వారు విలాస జీవితం అనుభవిస్తారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (January 1, 2026): మేష రాశి వారికి వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆర్థికంగా, ఆదాయపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి మార్గం సుగమం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Jan 1, 2026
- 5:31 am
Yearly Horoscope 2026: కొత్త ఏడాది ఈ రాశులకు కలిసొచ్చింది.. పట్టిందల్లా బంగారమే.. సంవత్సర రాశిఫలాలు ఇదిగో..
Horoscope in 2026: జనవరి 1- డిసెంబర్ 31, 2026 వరకు సంవత్సర ఫలాలు, జ్యోతిషవాణి: మేషం రాశి వారికి ఏలిన్నాటి శని దోషం ఉన్నప్పటికీ, ఈ ఏడాదంతా చాలావరకు సానుకూలంగానే గడిచిపోతుంది. వృషభం రాశివారికి లాభ స్థానంలో శని, దన స్థానంలో గురువు సంచారం వల్ల 2025 కంటే 2026 బాగా మెరుగ్గా ఉంటుంది. అయితే.. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి 2026 సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..
- TV9 Telugu Desk
- Updated on: Dec 31, 2025
- 8:05 pm
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 31, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. కొత్త వాహన కొనుగోలు ప్రయత్నాలు చేపడతారు. వృషభ రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు. మిథున రాశి వారు ṣఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆశించిన పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Dec 31, 2025
- 5:31 am
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 30, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి వారు వ్యాపారాల నిర్వహణలో మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. మిథున రాశి వారు మిత్రులకు సంబంధించిన శుభకార్యంలో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Dec 30, 2025
- 5:31 am
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 29, 2025): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో తొందర పాటుతో వ్యవహరించవద్దు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి నుంచి సహాయం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో అధికారుల నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Dec 29, 2025
- 5:31 am
Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయ వృద్ధి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (డిసెంబర్ 28, 2025): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు, కొత్త వ్యూహాలు ఆశించిన స్థాయిలో కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహం ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Dec 28, 2025
- 5:31 am
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 27, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. వృషభ రాశి వారికి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, మానిసిక ఒత్తిడి తగ్గుతుంది. మిథున రాశి వారు ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయ వృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Dec 27, 2025
- 5:31 am
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది..12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 26, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. పుణ్య క్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థికంగా ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Dec 26, 2025
- 5:31 am
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం..12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 25, 2025): మేష రాశి వారు ఆదాయ లక్ష్యాలను సాధించడం కోసం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తారు. సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. సాదా సీదా ఉద్యోగంతో విసుగెత్తిపోయి సవాళ్ల కోసం ఎదురు చూస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Dec 25, 2025
- 5:31 am
Horoscope Today: వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి..12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 24, 2025): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి పదోన్నతికి అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉండకపోవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగంలో సొంత బాధ్యతలను పూర్తి చేయడంతో పాటు, సహోద్యోగులకు సహాయపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Dec 24, 2025
- 5:31 am