Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (February 20, 2026): ఈ రోజు మేష రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరిగి, వృత్తి–వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. మిథున రాశి వారికి బాధ్యతలు పెరిగినా, ఆశించిన ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దిన ఫలాలు (ఫిబ్రవరి 20, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మీ పనితీరు, మీ సమర్థతతో అధికారులకు సంతృప్తి చెందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు నుంచి ఆదరణ పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబంతో ఆధ్యాత్మిక వ్యవహారాలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహకారంతో పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మీ పనితీరు, మీ సమర్థతతో అధికారులకు సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా పురోగ మిస్తాయి. తలపెట్టిన పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం కావచ్చు. బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందుతాయి. కొందరు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. లాభాలకు, రాబడికి లోటుండదు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇంటి బాధ్యతల విషయంలో కొద్దిగా ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆపర్లు అందుతాయి. ఇంటా బయటా శ్రమ ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగా ఒత్తిడి ఉంటుంది. ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కుటుంబంలో అనుకో కుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదే వీలు లాభసాటిగా సాగిపోతాయి. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. నిరు ద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. తలపెట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారిపోతాయి. ఆశించిన ఆదరణ లభిస్తుంది. ఇంటా బయటా చాలా వరకు అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీరు తలపెట్టిన మార్పులు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం మారే విషయంలో సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు పెరిగి, ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామి పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులకు అండగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మీ ప్రతిభకు డిమాండ్ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబంలో సుఖ సంతో షాలు వెల్లివిరుస్తాయి. భాగస్వాములతో విభేధాలు సమసిపోతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో ఆశించిన మార్పులు జరుగుతాయి. పని భారం తగ్గే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాలనిస్తాయి. బంధువుల ద్వారా ఆస్తి వివాదం ఒకటి సమసిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపా రాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. బంధువుల నుంచి శుభవార్తలందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా, నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.