AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పక్కా తెలంగాణ స్టైల్ స్పైసీ బోటి కర్రీ.. తిన్నారంటే లొట్టలేయాల్సిందే

తెలంగాణ సాంప్రదాయ నాన్‌వెజ్ వంటకాల్లో బోటి కర్రీకి ఉండే క్రేజే వేరు. ఆదివారం వచ్చిందంటే చాలా ఇళ్లల్లో మటన్, చికెన్‌తో పాటు స్పెషల్‌గా బోటి వండుతుంటారు. అయితే బోటిని సరైన పద్ధతిలో శుభ్రం చేసి వండకపోతే నీచువాసన రావడం లేదా ముక్కలు గట్టిగా సాగినట్లు ఉండటం జరుగుతుంది. కానీ 'శ్రీహర్ష కుకింగ్ ఛానల్' సరిత గారు చూపించిన పద్ధతిలో.. బాయిల్ చేసిన నీటిని వడకట్టి, ప్రత్యేకమైన బ్రౌన్ ఆనియన్ పేస్ట్ మరియు మసాలాలతో చిక్కటి గ్రేవీలా వండితే, అసలు బోటి తినని వారు కూడా మళ్లీ మళ్లీ అడిగి మరీ తింటారు.

Phani CH
|

Updated on: Nov 27, 2026 | 7:00 PM

Share
 కావలసిన పదార్థాలు: శుభ్రం చేసిన బోటి – 1 కేజీ, ఉల్లిపాయలు – 3, పండిన టమాటా – 1 మీడియం సైజు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్, పసుపు – 1 టీస్పూన్, కారం పొడి – 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడా, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – 1 టీస్పూన్, గరం మసాలా పొడి – పావు టీస్పూన్, బిర్యానీ ఆకు – 1, తాజా పుదీనా ఆకులు – 10 నుండి 15, తాజా కొత్తిమీర తరుగు – 1 గుప్పెడు, వంట నూనె – 4 నుండి 5 టేబుల్ స్పూన్లు, నీళ్లు – గ్రేవీకి ముక్కలు మునిగేంత వరకు సరిపడా.

1 / 5
తయారీ విధానం: శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసిన 1 కేజీ బోటిని ప్రెజర్ కుక్కర్‌లో వేయాలి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇందులో అర టీస్పూన్ పసుపు వేసి కలిపి మూతపెట్టి మీడియం మంటపై 7 నుండి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆవిరి పోయిన తర్వాత మూత తీసి.. బోటి 80 నుండి 90 శాతం మెత్తగా ఉడికిందో లేదో చూసి, జల్లిగరిటెతో అందులోని నీటిని పూర్తిగా వంపేసి ముక్కలను మాత్రమే పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఒక చిన్న పాన్‌లో 1 టీస్పూన్ నూనె వేడిచేసి సన్నగా తరిగిన 2 మీడియం ఉల్లిపాయ ముక్కలను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. చల్లారాక మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. వెడల్పాటి పాన్‌లో 4 నుండి 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత 1 బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించాలి.

3 / 5
ఆ తర్వాత సన్నగా తరిగిన 1 టమాటా, అర టీస్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు పుదీనా ఆకులు వేసి టమాటా పూర్తిగా గుజ్జుగా మారే వరకు నూనెలో మగ్గించాలి. ఇప్పుడు నీళ్లు వడకట్టిన బోటి ముక్కలు, 1 టీస్పూన్ తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి.. మూతపెట్టి సిమ్ లో 2 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు వేయించాలి. నూనె తేలిన బోటి ముక్కల్లో ముందుగా సిద్ధం చేసుకున్న బ్రౌన్ ఆనియన్ పేస్ట్ వేసి కలిపి, మూతపెట్టి సిమ్ లో మరో 2 నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత ముక్కలు మునిగేంత వరకు మాత్రమే కొద్దిగా నీళ్లు పోయాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి.

4 / 5
పాన్ పై మూతపెట్టి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి 5 నుండి 6 నిమిషాల పాటు గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేయాలి. చివరగా గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి మరో 2 నిమిషాలు కలుపుతూ చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే పక్కా తెలంగాణ స్టైల్ 'స్పైసీ గ్రేవీ బోటి కర్రీ' సిద్ధం! వేడివేడి అన్నంలో కలుపుకుని తిన్నా, చపాతీలు లేదా జొన్న రొట్టెల్లోకి నంజుకుని తిన్నా.. అద్భుతమైన మసాలాల ఘుమఘుమలతో ఎంతో రుచిగా ఉంటుంది!

5 / 5
Follow Us