జామకాయ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

samatha

26 November 2026

Pic credit - Pinterest

జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. శీతాకాలంలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఇందులో విటమిన్ సి ఉండటం వలన ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జామకాయ

అయితే జామకాయ తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కాగా,  ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

విటమిన్ సి

జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇందులో  ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గి కడుపు తేలికగా ఉంటుంది.

జీర్ణక్రియ ఆరోగ్యం

రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో కూడా జామకాయ బాగా పనిచేస్తుంది, మధుమేహం ఉన్నవారికి ఇది చాలా బెస్ట్ ఫ్రూట్ అని చెప్పాలి

షుగర్ లెవల్స్

జామకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది, రక్తపోటు అదుపులో ఉండి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది

గుండె ఆరోగ్యం

ఊబకాయంతో బాధపడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి జామకాయ మంచి ఆహారం, తక్కువ కేలరీలు ఉండి కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఇస్తుంది.

బరువు నియంత్రణ

ప్రతిరోజూ ఒక జామకాయ తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభించి, అలసట తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉంటారు

శరీరానికి శక్తి