చలికాలంలో రాగులు వాడుతున్నారా? ఇది తెలుసుకోండి!

Jyothi Gadda

27 November 2026

రాగుల్లో ఇనుము, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉండి శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

రాగుల్లోని సహజ గుణం శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. దీనివల్ల చలి ప్రభావం తగ్గి రోజంతా చురుగ్గా ఉండే శక్తి లభిస్తుంది.

శీతాకాలం, వర్షాకాలంలో రోగనిరోధకత తగ్గితే జలుబు, దగ్గు, ఫ్లూ వస్తాయి. రాగి జావ వ్యాధి నిరోధక శక్తిని పెంచి రక్షణనిస్తుంది.

రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. చలికి పెరిగే ఎముకలు, కీళ్ల నొప్పులను తగ్గించి, వృద్ధుల్లో ఎముకల బలహీనతను నివారించడంలో ఇది మేలు చేస్తుంది.

చలిలో నీరు తక్కువ తాగడం వల్ల వచ్చే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణాన్ని రాగి జావలోని ఫైబర్ తగ్గించి పేగుల కదలికలను సక్రమంగా ఉంచుతుంది.

రాగి జావ తాగిన వెంటనే శరీరానికి శక్తినిచ్చి కడుపు నిండిన భావన కలిగిస్తుంది. మధ్యలో ఆకలి వేయకుండా పనిపై దృష్టి నిలుస్తుంది.

పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సులభంగా జీర్ణమవుతుంది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తాగడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది.

తయారీ, ఇతర కాలాల్లో: రాగి పిండిని నీటితో కలిపి జావ చేసి పాలు లేదా మజ్జిగతో తాగుతారు. వేసవిలో మజ్జిగ లేదా పెరుగుతో కలిపితే మేలు చేస్తుంది