ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం
ఖమ్మం జిల్లా లోక్యాతండా గిరిజనులకు హోలీ కేవలం రంగుల పండుగ కాదు, ప్రాణంతో సమానం. ఇక్కడ పుట్టిన బిడ్డలకు పేరు పెట్టడానికి హోలీ పండుగ వరకు వేచి చూడాలి. హోలీ రోజునే నామకరణం, కాముని దహనం, విందులు, రంగుల ఆటలతో మూడు రోజులు జరుపుకుంటారు. ఈ ఆచారం గిరిజన సంస్కృతికి అద్దం పడుతూ సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది.
రంగుల పండుగ హోలీ అంటే అందరికీ ఆనందమే. కానీ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యాతండా గిరిజనులకు మాత్రం ఇది ప్రాణంతో సమానమైన వేడుక. ఇక్కడ హోలీ పండుగకు ఒక ప్రత్యేకమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. అదేమిటంటే.. ఈ తండాలో పుట్టిన బిడ్డలకు పేరు పెట్టాలంటే మళ్ళీ హోలీ పండుగ వచ్చే వరకు వేచి చూడాల్సిందే! లోక్యాతండాలో పుట్టిన ప్రతి బిడ్డకు నామకరణం కేవలం హోలీ రోజునే చేయడం ఇక్కడి తరతరాల ఆనవాయితీ. ఏడాది పొడవునా ఎప్పుడు బిడ్డ పుట్టినా, హోలీ వేడుకల్లో భాగంగా కుల పెద్దలైన ‘గేడియ’ల సమక్షంలోనే అధికారికంగా పేరు పెడతారు. ఈ ఆచారమే ఈ తండాను ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా నిలుపుతోంది. గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఇక్కడ మూడు రోజుల పాటు సంబరాలు హోలీ సంబరాలు జరుపుకుంటారు. మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటలకే ‘కాముని దహనం’తో వేడుకలు మొదలవుతాయి. రెండవ రోజు బంధుమిత్రులతో విందులు, వినోదాలు జరుగుతాయి. ఎంత దూరంలో ఉన్నా తండావాసులు ఈ రోజు సొంత గూటికి చేరుకుంటారు. మూడవ రోజు రంగోలి వేడుక. కాముని దహనం చేసిన బూడిదను శరీరంపై చల్లుకుని, అనంతరం రంగులతో హోలీని ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగ కోసం తండావాసులు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తారు. మహిళలు కొత్త వస్త్రాలు ధరించి, గిరిజన నృత్యాలతో తండాను మురిపిస్తారు. ఆత్మీయతకు, అనుబంధానికి వేదికగా నిలిచే లోక్యాతండా హోలీ వేడుకలు సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..
Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ
Thalapathy Vijay: పాపం విజయ్… కొడుకు కూడా ఛీపో అన్నాడు!
Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

