Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ
అప్పుడే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎల్నినో ప్రభావంతో కర్నూలు జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతుండటంతో అటు అధికారులు, ఇటు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జాతీయ స్థాయిలో ఎక్కడా లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలులోనే నమోదవుతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అప్పుడే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎల్నినో ప్రభావంతో కర్నూలు జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతుండటంతో అటు అధికారులు, ఇటు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జాతీయ స్థాయిలో ఎక్కడా లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలులోనే నమోదవుతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే జిల్లాలో 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత చరిత్రను పరిశీలిస్తే, 2024లో ఇప్పటివరకు దేశంలోనే అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదైన రికార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో గాలిలో తేమ శాతం ఒక్కసారిగా 15 శాతానికి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనివల్ల పొడి గాలి పెరిగి, వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వడగాల్పుల కారణంగా ప్రజలు త్వరగా డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మ వ్యాధులు, వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Thalapathy Vijay: పాపం విజయ్… కొడుకు కూడా ఛీపో అన్నాడు!
Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
ఈ రెండిటి తో.. మెరిసే చర్మం మీ సొంతం.. ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారాల్సిందే
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

