Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope in Telugu: ఫిబ్రవరి 24న మేష రాశి వారికి ఆర్థిక లాభాలు కలిగే అవకాశముండగా, స్నేహితులతో స్వల్ప విభేదాలు తలెత్తవచ్చు. వృషభ రాశి వారు వ్యాపారాల్లో లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి అదృష్టం కలిసివచ్చే అవకాశముంది. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Daily Horoscope 24 Feb 2026
ఫిబ్రవరి 24న కుంభ రాశిలో పంచగ్రహ కూటమి (సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు) ప్రభావం ఉండటంతో అన్ని రాశుల వారికి మానసిక స్థిరత్వం, భావోద్వేగ నియంత్రణ చాలా అవసరం. మేష రాశి వారికి ఆర్థికంగా భారీ లాభాలు వచ్చే అవకాశముంది. అయినా స్నేహితులతో చిన్నపాటి వివాదాలకు అవకాశముంది. వృషభ రాశి వారు తమ వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. మిథున రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
12 రాశుల వారికి రాశి ఫలాలు (ఫిబ్రవరి 24, 2026)
- మేష రాశి (Aries): ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయినా స్నేహితులతో చిన్నపాటి వివాదాలు రావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
- వృషభ రాశి (Taurus): వృత్తిపరంగా విప్లవాత్మక మార్పులు చూస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వల్ల వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
- మిథున రాశి (Gemini): ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే రోజు. మీ ఆశయాలు బలపడతాయి. కెరీర్, వ్యాపారాల్లో స్థిరమైన లాభాలు ఉంటాయి. వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు స్పష్టతతో ఉండండి.
- కర్కాటక రాశి (Cancer): వ్యాపార, కార్యాలయ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థులు చురుగ్గా ఉండే అవకాశం ఉంది, కాబట్టి అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు.
- సింహ రాశి (Leo): భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
- కన్య రాశి (Virgo): కోర్టు కేసులు లేదా ఇతర వివాదాల్లో విజయం లభిస్తుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాల వల్ల ఆర్థికంగా లబ్ధి పొందుతారు.
- తులా రాశి (Libra): మీలో సృజనాత్మకత పెరుగుతుంది. గత అనుభవాలు మీరు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడతాయి. వైద్య, హోటల్, ఫార్మా రంగాల వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది.
- వృశ్చిక రాశి (Scorpio): కుటుంబంలో శుభపరిణామాలు జరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి.
- ధనుస్సు రాశి (Sagittarius): ఉద్యోగ బదిలీల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మీ పురోగతిని సమీక్షించుకుంటారు. ఇంట్లో శుభకార్యాల కోసం ఏర్పాట్లు మొదలుపెడతారు.
- మకర రాశి (Capricorn): విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన రోజు. క్రీడలు, ఆడిటింగ్ రంగాల్లో ఉన్నవారికి కీలక సమాచారం అందుతుంది. స్నేహితులు, కుటుంబీకులతో అనుబంధాలు బలపడతాయి. మీ సౌమ్య ప్రవర్తన వల్ల అందరి మెప్పు పొందుతారు.
- కుంభ రాశి (Aquarius): మీ రాశిలో గ్రహాల కూటమి ఉండటం వల్ల ఆలోచనలు వేగంగా మారుతుంటాయి. స్థిరాస్తి పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారు.
- మీన రాశి (Pisces): మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోండి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆటంకాలు తొలగుతాయి.
Follow Us