ఖమ్మం జిల్లా రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. ఫిబ్రవరి 14న పాలేరు రిజర్వాయర్లో కారు పడి ఆయన మరణం ప్రమాదం కాదని, స్నేహితుడు వేణుమాధవ రెడ్డి డబ్బుల కోసం పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేయించాడని పోలీసులు ధ్రువీకరించారు. జీఎస్టీ లైసెన్స్, వ్యాపార లాభాల వివాదమే ఈ ఘాతుకానికి దారితీసింది.