లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
23 February 2026
బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అంతకు ముందు మహేష్ బాబు నటించిన ఓ సూపర్ హిట్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది.
ఆమె మరెవరో కాదు దివి వద్త్య. బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్‌తో తెలుగులో మరింత పాపులర్ అయ్యింది. ఈ షో ద్వారా అందరిని తనవైపు తిప్పుకుంది.
ఆ తర్వాత ఏకంగా చిరంజీవి సినిమాలోని ఛాన్స్ కొట్టేసింది. గాడ్ ఫాదర్ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. తర్వాత కథానాయికగా ఆఫర్స్ కోసం ఎదురుచూసింది.
తెలుగులో లంబసింగి సినిమాతో కథానాయికగా మంచి పేరు తెచ్చుకుంది. క్యాబ్ స్టోరీస్, పుష్ప 2, సింబా, రుద్రంగి, జిన్నా, నయీమ్ డైరీస్, డాకు మహారాజ్ చిత్రాల్లో నటించింది.
ఇటీవల కాలంలో నటిగా రాణిస్తున్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి బయటపెట్టింది. బ్రేకప్ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు చెప్పింది.
బ్రేకప్ టైమ్‌లో చాలా బాధపడ్డానని.. అవి ఎప్పటికీ మర్చిపోలేని రోజులను గుర్తుచేసుకుంది. బ్రేకప్ తర్వాత ఏ ఒక్కరినో బ్యాడ్ చేస్తుంటారని చెప్పుకొచ్చింది దివి.
కానీ మనం ప్రేమించినవారు మనతోటే ఉండాలనుకోవడం క్యూట్ అని.. అలా అనుకుంటేనే ప్రేమ అని.. లేదంటే అసలు అది ప్రేమే కాదని, ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలని తెలిపింది.
తన జీవితంలో మళ్లీ ఇలాంటి కష్టం వద్దు అనుకున్నవి ఏమైనా ఉన్నాయా అని అడగ్గా.. లవ్ వర్కౌట్ కాకపోవడమే అని తెలిపింది. అది చాలా పెయిన్ అని తెలిపింది.