నేషనల్ క్రష్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? రష్మిక సంపాదన ఎంతంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

23 February 2026

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే పాన్-ఇండియా కథానాయికగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా రష్మిక.. మరోవైపు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. రష్మిక, విజయ్ పెళ్లి పనులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. 

 రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరి వివాహం ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ప్యాలెస్ లో జరగనుంది.

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 48.9 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక ఏప్రిల్ 5, 1996న కర్ణాటకలోని విరాజ్‌పేటలో కొడవ కుంటుంబంలో జన్మించింది. 

ఆమె సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో మనస్తత్వశాస్త్రం, జర్నలిజం, ఇంగ్లీష్ లో గ్రాడ్యూయేషన్ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

2024లో, ఆమె ఫోర్బ్స్ ఇండియా యొక్క 30 అండర్ 30 జాబితాలో కూడా చోటు సంపాదించింది. ప్రస్తుతం రష్మిక మందన్నా వయసు 29 సంవత్సరాలు.

రష్మికకు తన కంటే 16 సంవత్సరాలు చిన్నదైన షిమాన్ మందన్న అనే చెల్లెలు కూడా ఉంది. 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీ ద్వారా రష్మిక సినీరంగ ప్రవేశం చేసింది.

 ఈ ముద్దుగుమ్మ ఆస్తుల విలువ దాదాపు రూ. 66 కోట్లు. పుష్ప 2: ది రూల్ కోసం ఆమె దాదాపు రూ. 10 కోట్లు పారితోషికం తీసుకుందని సమాచారం.