మునుగోడు మండలం కృష్ణాపురంలో తన యజమాని నందిపాటి పార్వతమ్మ మృతి చెందడంతో ఒక పెంపుడు కుక్క తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. మృతదేహాన్ని ఉంచిన ఫ్రీజర్ బాక్స్ వద్ద కన్నీరు కారుస్తూ, అంత్యక్రియల తర్వాత సమాధి వద్దే దీనంగా కూర్చుండిపోయింది. ఈ దృశ్యాలు నిజమైన ప్రేమ, విశ్వాసం ఎలా ఉంటాయో సమాజానికి గొప్ప పాఠంగా నిలిచాయి. స్నానాది కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆ కుక్క తన కృతజ్ఞతను చాటుకుంది.