AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Gochar: మార్చిలో ఆ రాశుల వారికి విలాస జీవితం..! ఇందులో మీ రాశి ఉందా..?

జ్యోతిషశాస్త్రం ప్రకారం సౌభాగ్యం, ఐశ్వర్యం, ప్రేమకు కారకుడైన శుక్రుడు మార్చి నెలలో రాశి మార్పులు చేయనున్నాడు. మార్చి 2న మీన రాశిలోకి, అనంతరం మార్చి 26న మేష రాశిలోకి ప్రవేశించే ఈ గ్రహగతులు నాలుగు రాశుల వారికి విశేష అదృష్టాన్ని తీసుకురానున్నాయి. ఈ కాలంలో వారు విలాసవంతమైన జీవితం వైపు అడుగులు వేయనున్నారని భావిస్తున్నారు.

Shukra Gochar: మార్చిలో ఆ రాశుల వారికి విలాస జీవితం..! ఇందులో మీ రాశి ఉందా..?
Luxury Life In March
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 23, 2026 | 4:46 PM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడిని సౌభాగ్యం, ఐశ్వర్యం, ప్రేమ, పెళ్లి, విలాసాలకు కారకుడిగా పరిగణిస్తారు. మార్చి మాసంలో శుక్రుడు తన రాశి, నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. మార్చి 2న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మార్చి 26న మేష రాశిలోకి ప్రవేశం చేయనున్నాడు. ఈ మార్పుల వల్ల ప్రధానంగా 4 రాశుల వారికి అదృష్టం వరించనుంది. ఈ రాశుల వారు లగ్జరీ జీవితాన్ని పొందనున్నారు.

  1. వృషభ రాశి: శుక్రుడి రాశి మార్పుతో ఈ రాశి వారికి మార్చి నెల ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
  2. మిథున రాశి: వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి వృద్ధిని చూస్తారు. ఉద్యోగంలో పై అధికారుల నుండి మద్దతు, ప్రశంసలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. విదేశీ వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీడియా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి ఇది ఉత్తమ సమయం.
  3. కర్కాటక రాశి: ఆగిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారంలో ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయం పెరగడంతో పాటు పొదుపు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి పనిలో విజయం లభించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి.
  4. కుంభ రాశి: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిలో మంచి పురోగతి ఉంటుంది. సంబంధాలలో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమ జీవితం మధురంగా సాగుతుంది. ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది, దీనివల్ల పాత అప్పులు లేదా ధన సంబంధిత సమస్యలు తీరుతాయి.

(గమనిక: ఈ సమాచారం రాశుల వారీగా జ్యోతిష్య నిపుణుల అంచనాల ఆధారంగా ఇవ్వబడింది. వ్యక్తిగత జాతక చక్రాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు)

Follow Us