సినిమా అనుకుంటాం కానీ.. సరదా తీరుస్తుంది భయ్యా..
కొంత మంది స్టార్లు సినిమాల కోసం.. తమ ఆరోగ్యాన్ని పణంగా పెడతారు. చేస్తున్న సినిమా కోసం.. కథ డిమాండ్ మేరకు.. ఫిజికల్‌గా రకరకాలుగా ట్రాన్స్ ఫాం అవుతుంటారు. ఈ కారణంగా తీవ్ర సమస్యలను కూడా ఎదుర్కొంటుంటారు. తాను కూడా బాహుబలి సినిమా తరువాత చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రానా. ఇప్పుడీ ఇంటర్వ్యూలోని రానా చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా అనుకుంటాం కానీ.. హీరోల సరదా తీరుస్తుందనే పూరీ డైలాగ్ కామెంట్ గా వచ్చేలా చేసుకుంటోంది.
ఎస్ ! బాహుబలి సినిమాలో భల్లాల దేవ క్యారెక్టర్ కోసం.. రానా భారీగా కండలు పెంచడమే కాదు. దాదాపు 4 సంవత్సరాల వరకు 100 కిలోల బరువును మెయిన్‌టేన్ చేశాడు. ఇందుకోసం హెవీ ప్రోటీన్ ఫుడ్ ను తీసుకున్నాడు. హెవీ వర్కవుట్స్ చేశాడు. అయితే దాదాపు 4 సంవత్సరాలు భారీగా ఉన్న రానా.. ఆ సినిమా తర్వాత హెవీ డైట్ స్టార్ట్ చేయడంతో.. ఇబ్బందుల్లో పడ్డాడు. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. బాహుబలి కోసం చేసిన వర్కవుట్స్ వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు రానా. అందుకోసం ఏకంగా విదేశాలకు వెళ్లి మరీ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాహుబలి వల్ల చాలా సినిమాలను కూడా వదులుకున్నాడు రానా. కేవలం రానా మాత్రమే కాదు, బాహుబలి తరువాత ప్రభాస్ కూడా తీవ్రమైన మోకాలి సమస్యలను ఎదుర్కొన్నాడు. అందుకోసం చిన్న సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది ప్రభాస్.
మరిన్ని వీడియోల కోసం :
తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

