OTT ట్రెండింగ్ లో.. వరల్డ్ బెస్ట్ హర్రర్ మూవీ!
గత వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లిష్ తో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను తెగ భయపెడుతోంది. టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతూ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటోది. గతేడాది థియేటర్లలో ఈ మూవీ విడుదల కాగా అప్పుడు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. రూ.490 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.4500 కోట్లు సంపాదించింది. ఈ సినిమా మరేదో కాదు.. ది కంజ్యూరింగ్!
హాలీవుడ్ పాపులర్ హారర్ థ్రిల్లర్ సిరీస్ లలో ‘ది కంజురింగ్’ ఒకటి. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను బాగా భయపెట్టాయి. ఇప్పుడు తొమ్మిదో సినిమాగా ‘ది కంజురింగ్ లాస్ట్ రైట్స్’ వచ్చింది. ఈ సిరీస్ లో ఇదే ఆఖరి సినిమా. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. ఇక ఫిబ్రవరి13న జియోహాట్‌స్టార్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ది కంజ్యూరింగ్ కథ విషయానికి వస్తే.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. పెన్సిల్వేనియాలోని ‘స్మర్ల్ హంటింగ్’ కేసు ఆధారంగా ఈ సినిమా కథ నడుస్తుంది. పారా నార్మల్ యాక్టివిటీస్, హారర్ ఎలిమెంట్స్, భయాన్ని దాటుకుని ఈ ప్రమాదకరమైన కేసును ఎలా సాల్వ్ చేశారన్నది ఈ సినిమా కథ. ఆద్యంతం భయపెట్టే సీన్లు, ఊహించని మలుపులతో ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తోంది..‘ది కంజురింగ్ లాస్ట్ రైట్స్’
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

