Face Pimples: ఏం చేసినా మొటిమలు తగ్గకపోగా , తరచూ వస్తున్నాయా.. కారణం ఇదేనేమో
మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో చర్మ సమస్యలు కూడా ఒకటి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మొటిమలు సాధారణ సమస్యగా మారిపోయాయి. కానీ ఈ సమస్య దీర్ఘకాలంగా ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మెటిమెలు రావడానికి కారణం తెలుకొని దానిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం జనాలు ఎదుర్కొంటున్న వర్క్ ప్రెజర్, అనారోగ్యమైన ఆహారం, రోజువారి అలవాట్ల కారణంగా చాలా మంది చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట ఆలస్యంగా మేల్కొని ఉండటం, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, తక్కువ నీరు త్రాగడం, మానసిక ఒత్తిడి వంటి వివిధ కారణాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. ఇటువంటి అలవాట్ల కారణంగా, ముఖంపై తరచుగా మొటిమలు కనిపిస్తాయి. ఇది యువకులు, స్త్రీలలో కనిపించే ఒక సాధారణ సమస్య, కానీ దానిని నెగ్లెట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది క్రమంగా చర్మం యొక్క సహజ కాంతిని తగ్గిస్తుంది. అంతే కాదు, ఇది మచ్చలకు కూడా దారితీస్తుంది.
మొటిమలు ఎందుకు వస్తాయి?
మాక్స్ హాస్పిటల్‌లోని చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ సౌమ్య సచ్‌దేవా ప్రకారం, చర్మంపై మొటిమలు పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో ఒకటి హార్మోన్ల మార్పులు రావడం. ఇది తరచుగా ఋతుస్రావం, గర్భధారణ లేదా ఒత్తిడి వంటి సమయాల్లో వస్తుంది. ఇవే కాదు జంక్ ఫుడ్, ఎక్కవగా తీపి ఆహారాలు తినడం వల్ల కూడా మొటిమెలు వస్తాయి. అలాగే, ముఖాన్ని తరచుగా లేదా మురికి చేతులతో తాకడం వల్ల కూడా బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల మొటిమలు వస్తాయి. అంతేకాదు మేకప్‌ను సరిగ్గా తొలగించకపోవడం, జిడ్డుగల చర్మంపై క్రీములు రాయడం, నిద్ర లేకపోవడం ,తక్కువ నీరు త్రాగడం వల్ల కూడా మొటిమల సమస్య పెరుగుతుంది. కొంతమందిలో, జన్యుపరమైన కారణాల వల్ల కూడా మొటిమలు కనిపిస్తాయి.
మొటిమలను ఎలా నివారించాలి?
సాధారణంగా మొటిమలను నివారించడానికి, మొదట మీ దినచర్యను మార్చుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ తేలికపాటి ఫేస్ వాష్‌తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం, మేకప్ ను పూర్తిగా శుభ్రం చేసుకోవడం ముఖ్యం.జంక్ ఫుడ్‌కు బదులు మీ రోజువారి ఆహారంలో ఆకుకూరలు, పండ్లను చేర్చుకోండి. అలాగే రోజుకు 3-4 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోండి. అలాగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. వీటిని క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మీరు మొటిమల సమస్యలను తగ్గించుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
