బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు!
వేసవి ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను వరుణుడు పలకరించనున్నాడు. హిందూ మహాసముద్రం మరియు నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
అల్పపీడన ప్రభావంతో శని,ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది.
మరిన్ని వీడియోల కోసం :
తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

