మాంసాన్ని తలదన్నే ఈ రోటీ పచ్చడి తింటే.. రుచితో పాటు తెలివితేటలు కూడా..

Prasanna Yadla

22 February 2026

Pic credit - Pixabay

అన్ని కూరగాయల్లో బెండకాయను చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే, ఇది అందరికి మోస్ట్ ఫేవరేట్ కాబట్టి 

బెండకాయలు 

బెండకాయలతో పులుసు కూరల నుంచి ఫ్రై కూరల వరకు చేసుకోవచ్చు. అయితే, కొత్తగా ఈ సారి బెండకాయలతో కొత్త రకం వంటకం చేద్దాం..

వీటితో కొత్త రకం వంటకం 

వీటితో ఇప్పటి వరకు కూరలు తిన్నాము కదా.. ఇప్పుడు బెండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

బెండకాయ రోటి పచ్చడి 

బెండకాయలు, 3 పండు టమాటాలు, 10 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ , 4 వెల్లుల్లి రెబ్బలు , ఉప్పు, నూనె వీటిని తీసుకోవాలి. 

కావాల్సిన పదార్ధాలు

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసుకుని  పచ్చిమిర్చి, టమాటాలు, బెండకాయలను  వేయించుకోవాలి

స్టెప్ - 1

ఆ తర్వాత వీటిని రోటిలో వేసుకుని మెల్లిగా దంచుతూ మధ్యలో ఉప్పు , ఉల్లిపాయలు కూడా వేసి పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకోవాలి.

స్టెప్ - 2

అలా రోటిలో రుబ్బిన  పచ్చడిని గిన్నెలోకి తీసుకుని నూనెలో వేసి తాలింపు పెట్టుకోవాలి. అంతే, వేడి వేడి బెండకాయ రోటి పచ్చడి రెడీ

స్టెప్ - 3

వేడి వేడి అన్నంలో బెండకాయ రోటి పచ్చడి , నెయ్యి వేసుకుని తింటే రుచితో పాటు మెదడు చురుకుగా పని చేస్తుంది

వేడి వేడి బెండకాయ రోటి పచ్చడి