ఆరోగ్యానికి మేలు చేసే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఇదే.. తిన్నా నో ఎఫెక్ట్!
Samatha
23 February 2026
చాలా మంది బయట ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు, అందుకే బయట ఫుడ్ అస్సలే తినకూడదు అని చెబుతుంటారు.
బయట ఫుడ్
బయట స్ట్రీట్ ఫుడ్ తినడం వలన గుండె సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి అంటారు. అందుకే చాలా మంది బయటి ఫుడ్ తినాలంటే భయపడతారు.
ఆరోగ్య సమస్యలు
కానీ కొన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాగా ఎలాంటి ఫుడ్ ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు చూద్దాం.
ఆరోగ్యానికి మంచిచేసే ఫుడ్
లైట్ భేల్ పూరి : స్ట్రీట్ స్నాక్ లైట్ భేల్ పూరి, పఫ్డ్ రైస్‌తో తయారు చేస్తారు. కూరగాయలు వంటివి కలుపుతారు. అందువలన దీనిని తినడం వలన గుండెకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదంట.
లైట్ భేల్ పూరి
మొక్క జొన్న పొత్తు: మొక్క జొన్నను నిప్పులపై కాల్చి ఇస్తారు. ఇందులో ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
మొక్క జొన్న పొత్తు
చిలకడ దుంప : నిమ్మకాయ, మిరియాలు, చిలకడ దుంప చాట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట. ఇందులో బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి.
చిలకడ దుంప
ఉడికించిన గుడ్లు : ప్రోటీన్ ఎక్కువగా ఉండే వాటిలో ఉడికించిన గుడ్లు మొదటి స్థానంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
ఉడికించిన ఎగ్స్
స్వీట్ కార్న్ : మొక్క జొన్నను ఉడికించి, నిమ్మరసం పూసి ఇస్తారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.