చికెన్ ఫ్రైడ్ రైస్.. ఇలా చేస్తే.. నోరూరిపోతుంది అంతే!
Samatha
21 February 2026
చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ ఫ్రైడ్ రైస్ తింటుంటారు. అయితే బయట కాకుండా, ఇంటిలోనే దీనిని సులభంగా చేయవచ్చు.
చికెన్ ఫ్రైడ్ రైస్
చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంటిలో చేసి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆశ్చర్య పరచాలి అనుకుంటున్నారా? అయితే దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసెయ్యండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి, దానిపై వెడల్పాటి పాన్ పెట్టి, అందులో రెండు స్పూన్ల నూనె పోయాలి. నూనె బాగా వేడి అయ్యేలా చూడాలి.
తయారీ విధానం
తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. వేగిన తర్వాత రెండు ఎగ్స్ పగల గొట్టి అందులో వేసి, బాగా కలపాలి.
వేయించడం
తర్వాత స్కిన్ లెస్ చికెన్ ముక్కలను అందులో వేసి, మంచిగా కలపాలి. అన్నీ బ్రౌన్ కలర్ లో వేసి, బాగా వేగేలా చూసుకోవాలి.
చికెన్ ముక్కలు
తర్వాత రుచికి సరిపడ ఉప్పు, టమాటో సాస్, సోయా సాస్, వేసి రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలపాలి.
సోయా సాస్
తర్వాత వడకట్టిన బియ్యం అందులో వేసి, కొంచెం మిరియాల పొడి, వేసి, మంచిగా కలుపుకోవాలి. అంతే వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.