జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు కరివేపాకు తినడం యమడేంజర్

Samatha

17 February 2026

కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ దీనిని వంటల్లో చేర్చుకుంటారు.

ఆరోగ్యానికి మంచిది

అయితే కరివేపాకు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలంట.

కొన్ని సమస్యలు ఉన్నవారు

కాగా కరివేపాకును ఎవరు జాగ్రత్తగా, మితంగా తీసుకోవాలి? దీనిని ఎవరు తినడం ఆరోగ్యానికి మంచిది కాదో చూద్దాం.

ఎవరు ఎక్కువ తీసుకోకూడదంటే?

అలెర్జీ, దురద వంటి సమస్యలతో బాధపడే వారు కరివేపాకును అతిగా తీసుకోకూడదంట. దీని వలన సమస్య తీవ్రతరం అయ్యే ఛాన్స్ ఉన్నదంట.

అలెర్జీ

అదే విధంగా డయాబెటీస్ సమస్యతో బాధపడుతూ, దానికి సంబంధించిన మందులు వాడే వారు కూడా కరివేపాకులను చాలా తక్కువగా తీసుకోవాలంట.

డయాబెటీస్

అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలు ఉన్నవారు కూడా కరివేపాకు చాలా మితంగా తీసుకోవాలంట.

థైరాయిడ్

అదే విధంగా తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా దీనిని తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు ఎందుకంటే? ఇది బీపీని త్వరగా తగ్గిస్తుంది.

తక్కువ రక్తపోటు

అయితే కరివేపాకు చాలా మంచిదే అయినప్పటికీ అతిగా తీసుకోవడం ప్రమాదకరం, ముఖ్యంగా పై సమస్యలు ఉన్నవారు చాలా మితంగా తీసుకోవడమే మంచిదంట.

మితంగా తీసుకోవాలి