దుబాయ్ బంగారం vs భారత్ బంగారం... ఏది మంచిదో తెలుసా?

Samatha

17 February 2026

ఇప్పుడు ఎవరి నోట విన్నా బంగారం ధరల ముచ్చటే వినిపిస్తుంది. మొన్నటి వరకు రాకెట్‌లా పరుగులు పెట్టిన బంగారం ధర ఈ మధ్య తగ్గుతూ వస్తుంది.

బంగారం ధరలు

దీంతో సామాన్యులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఈ మధ్య బంగారం గురించిన అనేక విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్‌తో మీ ముందుకు వచ్చాం.

తగ్గుతున్న ధరలు

దుబాయ్ బంగారం, భారత్ బంగారం కంటె ఎక్కువగా మెరుస్తూ ధగధగలాడుతుంది.  దీంతో చాలా మంది భారత్ బంగారం కంటే, దుబాయ్ బంగారం స్వచ్ఛమైది అంటారు.

దుబాయ్ వర్సెస్ భారత్

కాగా, ఇప్పుడు మనం ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం. దుబాయ్ బంగారం, భారత్ బంగారానికి నాణ్యత విషయంలో ఎలాంటి తేడా లేదని చెబుతున్నారు నిపుణులు.

ఏది నాణ్యమైనది

1990లో భారత్‌లో 18క్యారెట్ల బంగారం మాత్రమే చలామణిలో ఉండేదంట. దుబాయిలో 20 క్యారెట్ బంగారం చెలామణిలో ఉండేది. అయితే అప్పుడు భారత్‌లోని కస్టమర్లకు 20,22 క్యారెట్లపై అవగాహన ఎక్కువగా ఉండకపోయిది. అందుకే ఆ క్వాలిటీ ఇక్కడి వారికి ఇవ్వలేకపోయారంట.

1990

కానీ భారత్‌లో హాల్ మార్క్ అందుబాటులోకి వచ్చాక, క్యారెట్‌ల ప్రకారం, బంగారం స్వచ్ఛత , నాణ్యత రెండూ, దుబాయ్, భారత్‌లో ఒకే విధంగా ఉంటున్నాయంట.

హాల్ మార్క్

అయితే దుబాయ్ బంగారం ఎక్కువగా మెరవడానికి కారణం, వారు  ఆభరణాల తయారీలో  జింక్, ఎక్కువగా కలుపుతారంట. అందుకే అవి ఎక్కువ పసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాయంట.

దుబాయ్ బంగారం మెరుపు

అయితే దుబాయ్ బంగారం ఎక్కువగా మెరవడానికి కారణం, వారు  ఆభరణాల తయారీలో  జింక్, ఎక్కువగా కలుపుతారంట. అందుకే అవి ఎక్కువ పసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాయంట.

భారత్ ఆభరణాలు

కానీ ఎక్కువగా దుబాయిలో బంగారు ఆభరణాలు యంత్రాలతో తయారు చేస్తే భారత్‌లో మాత్రం చేతితో చేసే ఆభరణాలు మాత్రమే మగువలు  ఇష్టపడుతారంట.

చేతితో తయారు చేసేవి