‘నా సహనాన్ని పరీక్షించకండి’ఆ చెత్త వార్తలుపై మీనా సీరియస్
చైల్డ్ ఆర్టిస్టు నుంచి కథానాయికగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది హీరోయిన్ మీనా. ఇప్పటికీ వైవిధ్యమైన పాత్రలతో ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. అయితే సినీప్రయాణంలో సక్సెస్ అయినప్పటికీ తన పర్సనల్ విషయాలు మాత్రం నిత్యం నెట్టింట ప్రచారం జరుగుతుంటాయి. ముఖ్యంగా తన భర్త మరణం తర్వాత మీనాకు రెండో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్స్ చక్కర్లు కొడుతుంటాయి.
ఇప్పటికే ఈ రూమర్స్ పై స్పందించిన మీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దయచేసి ఇటువంటి రూమర్స్ వ్యాప్తి చేయకండి అని మీనా కోరడంతో కొంతకాలం ఆ గాసిప్స్ పత్తా లేకుండా పోయాయి. ఆ తర్వాత మళ్లీ అదే రూమర్స్ వినిపించాయి. తాజాగా మరోసారి తన గురించి వస్తున్న రూమర్స్ పై సీరియస్ అయ్యింది మీనా. తనకు రెండో పెళ్లి అని చెత్తంతా రాస్తున్నారని.. అందులో నిజం ఉంటే మీరు మాట్లాడుకోవడంలో తప్పు లేదని.. కానీ ఏదేదో ఊహించుకుని.. కల్పించుకుని రాయడం ముమ్మాటికీ తప్పే అని అన్నారు. తాను ఒక ఒంటరి మహిళను అందులోనూ సెలబ్రెటీని అనే కదా అని మీకు నచ్చినట్లు రూమర్స్ సృష్టిస్తున్నారని.. తన సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్నారు. తన కూతురు ఇవన్నీ చూస్తే ఏమనుకుంటుందని… ఈ రూమర్స్ తనకు ఎంతో అసౌకర్యంగా ఉందని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

