స్లీప్ టెర్రర్ పిల్లల్లో ఎందుకొస్తుంది
రాత్రిపూట పిల్లలు నిద్రలో ఏడవడం, నడవడం వంటివి చేసి, ఉదయం గుర్తులేదనడం 'స్లీప్ టెర్రర్' లక్షణం. 3-12 ఏళ్ల పిల్లల్లో ఇది సాధారణం. వారిని నిద్రలేపకుండా, నెమ్మదిగా బుజ్జగించాలి. అలసట, ఒత్తిడి, స్క్రీన్ టైమ్ దీనికి కారణాలు. నిద్ర షెడ్యూల్ పాటించడం ముఖ్యం. సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించాలి.
అర్ధరాత్రి వేళ. ఇంట్లో అంతా గాఢ నిద్రలో ఉండగా..మీ చిన్న పిల్లాడు నిద్ర లేచి అటు ఇటు తిరుగుతూ ఏడుస్తున్నాడా..? కాసేపటి తర్వాత మళ్లీ పడుకుంటున్నాడా..? ఉదయం అడిగితే తనకు తెలియదని అన్నాడా. అలాంటి పరిస్థితిని నిపుణులు స్లీప్ టెర్రర్ అంటున్నారు. 3 నుంచి 12 ఏళ్ల పిల్లలు ఎక్కువగా ఇలా ప్రవర్తిస్తుంటారట. సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొట్టడంతో ఓ సీనియర్ న్యూరాలజిస్టు స్పందించారు. ఇలాంటి పరిస్థితి పిల్లల్లో సాధారణమేనని, దీనినే స్లీప్ టెర్రర్ అంటారని తెలిపారు. ఈ సమస్య లక్షణాలతో పాటు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రాత్రి 11 నుంచి 12 గంటల సమయంలో హఠాత్తుగా పిల్లలు నిద్ర నుంచి లేస్తారు. ఏడవటం, కేకలు వేస్తూ గెంతడం, పడక నుంచి దూరంగా వెళ్లడం లాంటివి చేసి కాసేపయ్యాక నిద్రపోతారు. శారీరకంగా కూడా వారిలో మార్పు కనిపిస్తుంది. వేగంగా గుండె కొట్టుకోవడం, భయంగా ఉండటం, శ్వాస ఎక్కువగా తీసుకోవడం, చెమట పట్టడం జరుగుతుంది. ఆ సమయంలో పిల్లలు తల్లితండ్రులను గుర్తించలేరు. పిలిచినా పలకరు. మర్నాడు ఉదయం ప్రశ్నిస్తే గుర్తు లేదని చెబుతారు. అటువంటి పరిస్థితుల్లో తల్లితండ్రులు ఏం చేయాలో న్యూరాలజిస్ట్ వివరించారు. స్లీప్ టెర్రర్ సమయంలో పిల్లలు నిద్రలోనే ఉంటారు కాబట్టి వారిని మేల్కొలిపే ప్రయత్నం చేయొద్దు. నెమ్మదిగా బుజ్జగిస్తూ మళ్లీ పడుకోబెట్టాలనీ వారు అటు ఇటు తిరిగే సమయంలో అడ్డంగా వస్తువులు ఉంచకూడదనీ అన్నారు. పిల్లల్ని ఒంటరిగా వదలకుండా కుటుంబసభ్యుల్లో ఎవరైనా ఒకరు పక్కన ఉండాలనీ తెలిపారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా చూడటం. ఫోన్లు, టీవీలను ఎక్కువ సేపు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్లీప్ టెర్రర్‌కు కారణాలు పిల్లల్లో అలసట, తగినంత నిద్రపోకపోవడం, తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఇలాంటి లక్షణాలుంటే పిల్లలకు వచ్చే అవకాశం, కొత్త ప్రాంతం, కొత్త స్నేహితులు, కొత్త స్కూల్, అనారోగ్యమేనని అంటున్నారు. పిల్లలు రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా చూడాలనీ వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో స్లీప్ టెర్రర్ మాయమవుతుందనీ అంటున్నారు. సమస్య తీవ్రంగా ఉంటే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
High-Speed Metro: తొలి హైస్పీడ్ మెట్రో వచ్చేసింది
కొడుక్కి రూ. 4 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన హార్డిక్
తల్లి పెంపకమైతే.. తండ్రి ఇంటిపేరు అక్కర్లేదు
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె విప్పితే నోట్ల కట్టలు..
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె తీస్తే నోట్ల కట్టలు
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

